ధనుష్ కథానాయకుడిగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ తమిళంలో ఈ సంక్రాంతికి విడుదలై మంచి టాక్ సంపాదించుకొంది. ఇప్పుడు ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగుకీ, తమిళ వెర్షన్కీ రన్ టైమ్ లో మార్పు ఉంది. తమిళంలో ఈ సినిమా రన్ టైమ్ 2 గంటలత 45 నిమిషాలు. తెలుగులో కాస్త స్పీడ్ పెంచే ఉద్దేశంతో 11 నిమిషాలు ట్రిమ్ చేశారు. అంటే తెలుగు నిడివి 2 గంటల 34 నిమిషాలన్నమాట.
తెలుగులో ధనుష్కి మంచి అభిమానగణముంది. తన మునుపటి డబ్ చిత్రాలు తెలుగులో మంచి వసూళ్లనే రాబట్టాయి. ముఖ్యంగా ‘రఘువరన్ బీటెక్’ తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ‘కెప్టెన్ మిల్లర్’కి తెలుగులో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం తదితర నగరాల్లో ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు పడబోతున్నాయి. ఓ డబ్ సినిమా, అందులోనూ వారం రోజులు ఆలస్యంగా విడుదల అవుతున్న చిత్రానికి పెయిడ్ ప్రీమియర్లు పడడం విశేషమే. దానికి తగ్గట్టు టికెట్లు కూడా బాగానే అమ్ముడుపోతున్నట్టు టాక్.