సాధారణంగా రాంగోపాల్ వర్మ సినిమాల్లో… పాటలకు స్థానం తక్కువ. డ్రీమ్ సాంగ్స్‌కి, ఇంట్రడక్షన్ పాటలకు వర్మ ఛాన్స్ ఇవ్వడు. దాంతో.. అవసరమైన మేరకే పాటలొస్తుంటాయి. పాటలు లేకుండా సినిమాలు చేసిన సందర్భాలు కోకొల్లలు. అయితే… ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో మాత్రం వర్మ ఏకంగా 8 పాటలకు ఛాన్సిచ్చాడట. కల్యాణి మాలిక్ స్వరాలు అందిస్తున్న చిత్రమిది. ఎనిమిది పాటలూ సందర్భానికి తగ్గట్టుగానే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో వినిపిస్తాయని సమాచారం. ఈ ఎనిమిదీ సెమీ క్లాసిక్ స్థాయిలో ఉంటాయట. బీట్లు, దరువులు…ఇవేం లేకుండా ఈ పాటల్ని కంపోజ్ చేసినట్టు తెలస్తోంది. ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఎన్టీఆర్ పాత పాటల్ని కొన్ని వాడుకుంటున్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లోనూ అలా పాత పాటల్ని గుర్తు చేసే అవకాశం ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లలేదట వర్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్‌కి పోటీగా ఈసినిమా విడుదల చేస్తారు. ఎన్టీఆర్ లోని తొలి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల అవుతుంది. ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 24న విడుదల అవుతుంది. ఈ రెంటిటి మధ్యలోనే `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదల కాబోతోంది.