మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మోసగాళ్లు. ఇదో వైట్ కాలర్ మోసం చుట్టూ తిరిగే కథ. టెక్నాలజీని వాడుకుంటూ… మోసగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే కథ. ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. కాజల్, సునీల్ శెట్టి లాంటి స్టార్లు ఈ చిత్రానికి వెన్నెముక. నవదీప్, నవీన్ చంద్ర లాంటి యూత్ బ్యాచ్ కూడా కనిపిస్తున్నారు. త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే.. విడుదలకు ముందే… ఈసినిమాలోని తొలి 10 నిమిషాల ఎపిసోడ్ నీ మంచు విష్ణు చూపించేస్తున్నాడట. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలాంటి ప్రధానమైన నగరాల్లో స్క్రీనింగ్ ఏర్పాటు చేసి, తొలి 10 నిమిషాల సినిమానీ ప్రదర్శించే ఏర్పాట్లలో ఉన్నాడట. ఇది వరకు కొన్ని సినిమాలకు ఇదే జరిగింది. తొలి సన్నివేశాల్ని ముందే ఆన్ లైన్లో విడుదల చేసి, జనాల క్యూరియాసిటీ పెంచేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు అదే బాటలో విష్ణు కూడా నడుస్తున్నాడు. కాకపోతే.. ఈసారి ప్రత్యేకమైన ప్రదేశాల్లో, నగరాల్లో, ప్రత్యేకమైన ప్రేక్షకులకే ఈ తొలి 10 నిమిషాలూ చూసే ఛాన్స్ వుంది.