అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ ని సినిమాపై ఆసక్తిని పెంచేలా కట్ చేశారు. ‘మన లైఫ్ పార్టనర్ తో కలసి వేల రాత్రులు పడుకోవాలి. వందల వెకేషన్స్ కి వెళ్ళాలి. అంతకుమించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు ?” అని పూజా వాయిస్ తో ట్రైలర్ ఓపెన్ అయ్యింది.
‘అబ్బాయి లైఫ్ లో 50% కెరీర్ 50% పెళ్లి. మ్యారేజ్ లైఫ్ బావుండాలంటే కెరీర్ బావుండాలనే’ డైలాగ్ తో అఖిల్ క్యారెక్టర్ రివిల్ అయ్యింది. తర్వాత వచ్చిన కొన్ని పెళ్లి చూపులు సీన్స్ ఫన్నీగా సాగాయి. తర్వాత సడన్ గా అఖిల్ క్యారెక్టర్ లో ఒక సీరియస్ ని మార్పు కనిపించడం అక్కడి నుంచి కొన్ని ఎమోషనల్ షాట్స్ కధలో కీలక మలుపు చూపించాయి. అన్నట్టు ట్రైలర్ లో ఓ కోర్టు సీన్ కూడా వుంది. ‘ వైల్డ్ థింక్ చెయ్ డార్లింగ్” అని ఫరియా పాత్ర చెబితే దానికి పోసాని ”హామ్మా…”అంటూ ఇచ్చి ఎక్స్ ప్రెషన్ నవ్వుతెప్పింది. ”లోకం సర్దుకుపో అంటుంది. మందని వదిలి. కొత్త దారి వెతికి.. నేను వెళ్తున్నా. మీరూ రండి” అని చివర్లో అఖిల్ చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ని ముగించారు. ఆ కొత్త దారి ఏంటి అనేది ఈ సినిమా పాయింటని అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ట్రైలర్ బావుంది. సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.