ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన భారతీయులుంటారు. అందులోనూ తెలుగువారు ఉంటారని అంటుంటారు. ముఖ్యంగా యునైటెడ్ సేట్స్ ఆఫ్ అమెరికా అంటే… తెలుగు వారికి అమీర్ పేటకు వెళ్లినంత హిజీగా, ఇంట్రెస్ట్ గా వెళ్తున్నారన్న పేరుంది. ఇప్పుడు ఈ మాట నిజమేనంటోంది అమెరికా సెన్సస్ బ్యూరో.
ముఖ్యంగా అమెరికాలో గత ఎనిమిదేండ్లలో తెలుగువాళ్ల జనాభా నాలుగు రెట్లు పెరిగింది. అమెరికా సెన్సస్ బ్యూరో నివేదిక ప్రకారం.. 2016లో అమెరికాలో 3.2 లక్షల మంది తెలుగువాళ్ల జనాభా ఉండగా, 2024నాటికి ఆ సంఖ్య 12.3 లక్షలకు చేరుకుంది.
కాలిఫోర్నియాలో 2 లక్షలు,
టెక్సాస్ 1.5 లక్షలు,
న్యూజెర్సీ 1.1 లక్షలు,
ఇల్లినాయిస్లో 83 వేలు,
వర్జీనియాలో 78 వేలు,
జార్జియాలో 52 వేల మంది తెలుగువాళ్లు ఉన్నట్లు నివేదిక చెబుతోంది.
ఇందులో దాదాపు 10 వేల మంది హెచ్1బీ వీసా పొందగా. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు యూఎస్ వెళ్తున్నారు. అక్కడికి వెళ్లిన వారిలో 75 శాతం మంది అక్కడే స్థిరపడగా, ఎక్కువగా డల్లాస్, బేఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లేలో స్థిరపడ్డారు. అమెరికాలోని 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉన్నది. హిందీ, గుజరాతీ భాషల కంటే తెలుగు మాట్లాడేవారే ఎక్కువ ఉండటం విశేషం.