యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మరో కొద్ది గంటల్లో విడుదలవుతున్న ఈ సందర్భంలో సినిమా గురించి మరిన్ని విషయాలు బహిర్గతమవుతున్నాయి. సినిమా మొత్తం నాన్న ఆశయం కోసం పాటుపడే అబ్బాయిగా ఎన్.టి.ఆర్ అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడట. ముఖ్యంగా సినిమా చివర 40 నిమిషాలు సెంటిమెంట్ తో నింపేశాడట దర్శకుడు సుకుమార్. తారక్ తన మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడట.
సినిమాలో ఎన్.టి.ఆర్ నాన్నగా వర్సటైల్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నటించగా.. అమ్మగా ఒకప్పటి హీరోయిన్ మధుబాల నటించింది. అంతేకాదు నాన్నకు ప్రేమతో సినిమాలో అమ్మ సెంటిమెంట్ కూడా అందరిని ఆకట్టుకుంటుందట.. సినిమాలో మధుబాలతో కేవలం రెండు సన్నివేశాలే ఉన్నా అవి సినిమాకు ఊపిరినిచ్చేలా ఉంటాయని తెలుస్తుంది.
శ్రీ వెంకటేశ్వర సిని క్రియేషన్స్ పతాకంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ సరసన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ జత కట్టింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మరి కొద్దిగంటల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది మరి సినిమా ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.