హైదరాబాద్ శివారులోని మొబిలిటీ వ్యాలీని రేవంత్ ప్రభుత్వం కొనసాగించనుంది. వ్యాలీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తాజాగా టెండర్లు పిలిచారు. రూ. 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 5 సంవత్సరాల్లో 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్న టార్గెట్ తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మొబిలిటీ వ్యాలీకి ప్లాన్ చేసింది. మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టును 940 ఎకరాల్లో.. రూ.50 వేల కోట్ల పెట్టుబడులతో..4 లక్షల మం దికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోమిన్‌పేట మండలంలోని ఎన్కతలలో ఏర్పాటు చేయాలని సంకల్పించిం ది.
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలోని ఎన్కతల గ్రామంలో మొబిలిటీ వ్యాలీని ప్లాన్ చేశారు. భూసేకరణ పూర్తి అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మౌలిక సదుపాయాల పనులపై నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఈ భారీ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. రోడ్లు ఇతర సౌకర్యాలు కల్పించేందుకు టెండర్లు పిలిచారు. ఈ భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు స్వచ్ఛందం గా భూములిచ్చేందుకు ముందుకొచ్చిన నష్టపరిహారాన్ని కూడా ఇచ్చారు. మొబిలిటీ వ్యాలీ లో ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు విడి భాగాల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి భూములు కేటాయించనున్నారు.
తెంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో పెట్టుబడులు పెట్టే వారికి ఇక మొబిలిటి వ్యాలీలో స్థలాలను ప్రతిపాదించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు గతంలో ఎంవోయూ చేసుకున్నారు. వారందర్నీ ప్రభుత్వం వైపు నుంచి మరోసారి సంప్రదించే అవకాశాలు ఉన్నాయి.