తెలుగు సినిమా స్టామినా వంద కోట్లు కలెక్ట్ చేసే స్థాయి వచ్చిందనే అనుకోవచ్చు.. బహుబలి ద్వారా దాన్ని నమ్మేలా చేసినా శ్రీమంతుడు సెంచరీ దాకా లాక్కొచ్చేశాడు. అయితే ఒకప్పుడు తెలుగు సినిమా బడ్జెట్ తక్కువగా ఉండేది కాబట్టి సినిమా కలక్షన్స్ భారీగా వస్తే నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టేవి. అయితే ఇప్పుడు సినిమా బడ్జెట్ రూపేనా ఖర్చులు ఎక్కువయ్యేసరికి వచ్చే వసూళ్లు సినిమాకు పెట్టిన ఖర్చు ఒక దగ్గరకే వచ్చి చేరుతున్నాయి.
టెక్నికల్ పరంగా సినిమాలను తీర్చిదిద్దాలంటే లిమిటెడ్ బడ్జెట్ సరిపోదు అయితే అలాంటి సినిమా కథల్లో మంచి విషయం కూడా ఉండేలా జాగ్రత్త పడితే మంచిది. భారీ బడ్జెట్ సినిమా అనగానే ప్రేక్షకులు కూడా భారీ తనంతో ఆలోచించే అవకాశం ఉంది. వారి అంచనాలను మించి సినిమా తీసే సత్తా ఉంటేనే భారీ సినిమాలు చేయాలి. లేదంటే నిర్మాత రోడ్డున పడటం ఖాయం.. ప్రస్తుతం తెలుగు సినిమా వంద కోట్ల సినిమా బడ్జెట్ వైపు అడుగులు వేస్తుంది. అలాంటి సినిమాల్ను ఆడించే సత్తా అంతకంతకు రెట్టింపు వసూళు చేసే స్టామినా తెలుగు సినిమాలకు ఉన్నా వాటిని తెరకెక్కించే మార్గంలో తీసుకునే జాగ్రత్తలను బట్టే వాటి ఫలితం ఆధారపడి ఉంటుంది.
మరి కోట్ల బడ్జెట్ దాటుతున్న తెలుగు సినిమా ప్రస్థానం ఇలానే కొనసాగి ప్రాంతీయ సినిమా అయినా సరే బాలీవుడ్ ను షేక్ చేసే స్టామినా రావాలని వస్తుంది అని ఆశిస్తున్నారు సిని అభిమానులు.