ఆమె కడుపులో పెరుగుతన్న బిడ్డతో నాకు సంబంధం లేదని ఏ భర్త అయినా అంటే.. అతనిపై సమాజం విరుచుకుపడుతుంది. ఆ భార్య సంగతి చెప్పనక్కరలేదు. కానీ.. బెంగాల్‌కు చెందిన సినీ నటి.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మాత్రం.. అలా అన్న భర్తపై… ఆర్థికపరమైన ఆరోపణలు చేశారు.. అతనితో జరిగిన పెళ్లి చెల్లదన్న స్పష్టం చేశారు కానీ… ఆయన చేసిన ఆరోపణలపై మాత్రం స్పందించలేదు. ఎంతైనా నుస్రత్ జహాన్.. సినీ.. రాజకీయ రంగ సెలబ్రిటీ. దీంతో.. చర్చ జోరుగా సాగుతోంది.
బెంగాల్ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న నుస్రత్ జహాన్.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో టీఎంసీలో చేరి ెంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆమె నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఈ న్యూస్ కూడా హైలెట్ అయింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. హఠాత్తుగా నిఖిల్ జైన్… ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డకు.. తనకు సంబంధం లేదని.. ఆరు నెలల నుంచి తాముదూరంగా ఉన్నామని ప్రకటించారు. దీనిపై రచ్చ జరగడంతో తమ పెళ్లికి చట్టబద్ధత లేదని నుస్రత్ జహాన్ ప్రకటించారు. జైన్ తన ఆస్తులు, డబ్బులు లాక్కున్నారని ఆరోపించారు. నిఖిల్ జైన్‌తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఈ పెళ్లి భారత్‌లో చెల్లదని .. అందువల్ల విడాకుల ప్రస్తావనే రాదని.. ఆమె తేల్చేసింది.
నుస్రత్ జహాన్ గర్భానికి కారణం.. నటుడు, బీజేపీ నాయకుడైన యష్ దాస్ గుప్తా అని ప్రచారం జరుగుతోంది. నుస్రత్ దాస్ గుప్తాతో సహజీవనం చేస్తున్నట్లుగా బెంగాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జోడీగా ఎస్ఓఎస్ 2020 అనే బెంగాలీ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇది పూర్తిగా నుస్రత్ జహాన్ వ్యక్తిగతమే అయినప్పటికీ.. సినీ ..రాజకీయ సెలబ్రిటీ కావడంతో..అందరికీ కావాల్సిన అంశంగా మారిపోయింది.