ఢిల్లీ లిక్కర్ స్కాంలో బినామీల పేరుతో వ్యవహారాలు నడిపిన వారిలో ఎంపీ సంతోష్ ఉన్నారని ఆయనపై సీఎం కేసీఆర్ మండిపడ్డారని.. ఈ కారణంగా ప్రగతి భవన్‌కు వెళ్లడం లేదని.. ఆజ్ఞాతంలో ఉన్నారని జరుగుతున్న ప్రచారంపై ఎంపీ స్పందించారు. అందరికీ కాకుండా తనకు బాగా తెలిసిన ఒకరిద్దరు మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నానని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ లేకుండా తాను జీరో అని.. ఆయన స్పష్టం చేశారు.
తాను మనిషినేనని.. శారీరక , మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అందులో నాలుగు రోజులుగా ఎవరికీ అందుబాటులో లేనన్నారు. అయితే సంతోష్ మాత్రం ఎప్పట్లా ప్రగతి భవన్ విధుల్లో లేరని తెలుస్తోంది. నిన్నా మొన్నటి వరకూ కేసీఆర్ అపాయింట్ మెంట్లు మొత్తంఆయన చేతుల్లో ఉండేవి. కేసీఆర్ ఓకే అంటేనే ఎవరికైనా ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ ఉంటుంది. కానీ ఢిల్లీ లిక్కర్ స్కాం ఎప్పుడు బయటపడిందో అప్పుడు కలకలం ప్రారంభమయింది. వెన్నమనేని శ్రీనివాసరావు రూ . రెండు వందల కోట్లకుపైగా హవాలా చేశారని .. ఆయన సంతోష్‌కు సన్నిహితుడన్న ప్రచారం జరగడంతో చిక్కులు ప్రారంభమయ్యాయి. ఎలా కవర్ చేసుకోవాలో తెలియక సంతోష్ కూడా సతమతమవుతున్నారు.
ఈడీ దాడులు.. అందులో ఇమిడి ఉన్న అంశాలపై ఏం జరగాలో అదే జరుగుతుందని ఎంపీ చెబుతున్నారు. ఆయితే ఆయన బీజేపీ నేతల్ని సంప్రదించారని.. కానీ ఈ విషయంలో ఎలాంటి సాయం చేయలేమనివారు చెప్పినట్లుగా ఢిల్లీ మీడియా వర్గాలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నాయి. అదే నిజమైతే.. ప్రగతి భవన్‌తో ఎంపీ సంతోష్ దూరం మరింత పెరుగుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.