ట్విట్టర్ వేదికగా ఇవాళ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందిన మరియు జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరేన్ కి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కి, ఒడిస్సా ఎంపీ అయినటువంటి సప్తగిరి కీ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒడిస్సా ఎంపీ సప్తగిరి, జగన్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..
సిబిఐ ఈడి కేసులకు భయపడి జగన్ కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతున్నాడనే విమర్శలు ఎప్పటినుండో ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి మోడీ తనను మాట్లాడనివ్వట్లేదని వాపోతే, బిజెపి నాయకుల కంటే ఎక్కువగా బాధ పడ్డ జగన్, ఇటువంటి విపత్కర సమయంలో మోడీని బద్నామ్ చేసే రాజకీయాలు చేయవద్దని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కి ట్విట్టర్ ద్వారా ప్రాధేయ పూర్వకమైన అభ్యర్థన తో కూడిన విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Click here:
https://www.telugu360.com/te/jagan-fires-at-jharkhand-cm-for-criticizing-modi/
అయితే జగన్ ట్వీట్ పై స్పందించారు ఎంపీ సప్తగిరి ఉలాక. వైయస్ రాజశేఖర రెడ్డి వంటి బలమైన నేత కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడి దాడులకు భయపడి మోడీ కాళ్ళ వద్ద సాగిలబడడం అత్యంత బాధాకరం అని వ్యాఖ్యానించారు ఎంపీ సప్తగిరి. జగన్ గారూ, మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు అని గుర్తు చేస్తూ ఇప్పటికైనా కాస్త ఎదగండి అంటూ సెటైర్ వేశారు.
@MB_YSJ_cult entra kojja Lanjakodaka @ysjagan em bhatuku ra nee bhatuku kojja gadivi
— . ᴼᴳ (@NizamNawab45) May 7, 2021
అయితే వైఎస్ఆర్సిపి అభిమానులు మాత్రం ఇటువంటి వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారు. ఒకసారి సోనియాగాంధీకి ఎదురుతిరిగినందుకే తమ నాయకుడు అనవసరంగా 11 నెలల జైలు జీవితం గడపాల్సి వచ్చిందని, అందుకే జైలు నుంచి విడుదలయ్యాక సోనియా గాంధీ పై కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీపై కానీ ఎప్పుడూ జగన్ విమర్శలు చేయలేదని, విమర్శలు చేసి అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కంటే జగన్ తన పని తాను చేసుకుంటూ పోవడం మంచిదని వారు భావిస్తున్నారు. ఇతరులు మాత్రం, జగన్ వైఖరి వల్ల కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్క సహాయం కూడా రాష్ట్రానికి అందడం లేదని ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందని విమర్శిస్తున్నారు.