ఖమ్మం కాగ్రెస్ ఎంపీ టిక్కెట్ కోసం భారీ పోటీ నెలకొంది. మొదట సోనియా గాంధీ పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక రేసులో గట్టి పోటీ ఇస్తారనుకున్న రేణుకా చౌదరి కూడా తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఇప్పుడు పోటీ అంతా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని మధ్య ఉంది. వీరిద్దరి కోసం ఇద్దరు మంత్రులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఖమ్మం పార్లమెంట్ సీటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ఏడు సెగ్మెంట్లనూ కాంగ్రెస్, సీపీఐ గెల్చుకున్నాయి. కొత్తగూడెం నుంచి సీపీఐ గెలవగా.. మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు అన్ని సెగ్మెంట్లలో కలిపి రెండున్నర లక్షలకుపైగా మెజార్టీ కాంగ్రెస్ కు రావడంతో .. ఎవరు గెలిచినా విజయం ఖాయమని అనుకుంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొంత బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఎన్నికల వ్యూహాలపై ఇంకా క్లారిటీ రాలేదు. గత ఎన్నికలకు ముందు పొత్తు కుదరడంతో సీపీఐ, కాంగ్రెస్ కలిసి పోటీచేశాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ రెండు కలిసే పోటీ చేయనున్నాయి. అయినా కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం లేదని.. అంటున్నారు. వారసలకు కాకుండా ఇతర నేతలకు సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది.