దేవదాసు, మన్మథుడు, మజ్ను… ఇలాంటి టైటిల్లు అక్కినేని హీరోలకు భలే సరిపోతాయి. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు దేవదాసుగా అలరించారు. నాగార్జున మన్మథుడిగా, మజ్నుగా అవతారం ఎత్తారు. ఇప్పుడు మూడో తరంలో అఖిల్ `మిస్టర్ మజ్ను` అయిపోయాడు. అఖిల్ నటిస్తున్న మూడో చిత్రమిది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు టీజర్ విడుదలైంది. మజ్ను అంటే అమర ప్రేమికుడు అనుకుంటారేమో. ఈ మజ్ను మాత్రం రొమాంటిక్ ఫెలోనే. చుట్టూ అమ్మాయిలు, వాళ్లని ఫ్లట్ చేయడం, వెంట తిప్పుకోవడం… ఇదీ ఈ మజ్ను చేసే పని. `ఏంటో ఈ ఇంగ్లీషు భాష… దేన్నయితే మిస్ చేయకూడదో దాన్నే మిస్ అన్నారు` అంటూ… అమ్మాయిల్ని పడేయడానికి ఓ బాణం వదిలాడు ఈ సన్నాఫ్ మన్మథుడు. మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్, దాన్ని పాడిన విధానం, అఖిల్ లుక్స్ ఇవన్నీ సూపర్బ్‌గా కుదిరాయి. అఖిల్ మేనరిజమ్స్ నాగ్ని గుర్తుకు తీసుకురావడం ఖాయం. అఖిల్, హలో సినిమాలో డీలా పడిన అఖిల్.. ఈసారి మాత్రం హిట్టు కొట్టేట్టే కనిపిస్తున్నాడు. చూద్దాం.. ఈ మజ్ను ఏం మంత్ర వేస్తాడో..?!