మృణాల్ ఠాకూర్ స్పీడు మామూలుగా లేదు. వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇటీవలే ‘హాయ్ నాన్న’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’లోనూ తనే కథానాయిక. చిరంజీవి `విశ్వంభర`లోనూ ఛాన్స్ అందుకొందని టాక్. ఇప్పుడు మరో రెండు సినిమాలపై సంతకాలు చేసింది. ఆ రెండింటిలోనూ లారెన్స్ నే హీరో.
లారెన్స్ కథానాయకుడిగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. దీనికి ‘శ్రీరామ రక్ష’ అనే టైటిల్ ఖరారు చేశారని టాక్. ఇందులో హీరోయిన్ గా మృణాల్ ని ఎంచుకొన్నారు. తమిళ దర్శకుడు రవికుమార్‌తో లారెన్స్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులోనూ మృణాల్‌నే కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. రవికుమార్ ప్రస్తుతం శివ కార్తికేయన్ తో ‘అయలాన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ వెంటనే లారెన్స్‌తో సినిమా మొదలవుతుంది. రమేష్ వర్మ చిత్రాన్ని కూడా లారెన్స్ సమాంతరంగా పూర్తి చేస్తారని టాక్.