ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘కల్కి’ పూర్తవ్వగానే ఈ చిత్రానికి ప్రభాస్ కాల్షీట్లు ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే హను కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. పిరియాడికల్ సెటప్‌లో సాగబోతోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయంలో హను ఇప్పటికే కొంత స్పష్టతకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం కూడా ‘సీతారామం’ టీమ్‌నే కొనసాగించాలని హను భావిస్తున్నాడట. కథానాయికగా మృణాల్ ఠాకూర్ ఎంపిక దాదాపుగా ఖాయమైంది. `సీతారామం`లో సీతగా కనిపించింది మృణాల్. ఆ సినిమా మృణాల్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ప్రభాస్ తో తన జోడీ బాగుంటుందని హను భావిస్తున్నాడు. ‘సీతారామం’ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఇప్పటికే విశాల్ తో మ్యాజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని టాక్. కెమెరామెన్‌గా పి.ఎస్.వినోద్ నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ‘సీతారామం’ సెటప్ ప్రభాస్ సినిమాలోనూ చూడొచ్చన్నమాట!