భారత క్రికెట్ చరిత్రలోనే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకడు. కెప్టెన్ కూల్‌గా, గ్రేట్ ఫినిషర్‌గా, ది బెస్ట్ కీపర్ బాట్స్ మెన్‌గా కితాబులందుకున్నాడు. ధోని జీవితం సినిమాగానూ వచ్చింది. అక్కడా ధోని హిట్టే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని సమాచారం. వెండి తెరపై ధోనీగా కనిపించిన సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఈసారి కూడా ఆ పాత్రని తానే పోషించబోతున్నాడు. ధోని బాల్యం నుంచి 2011 వరల్డ్ కప్ విజయం వరకూ `ధోని`లో చూపించారు. ఆ తరవాత ఏం జరిగింది? ఐపీఎల్ సారధిగా ధోని తీసుకున్న నిర్ణయాలు, కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడానికి గల కారణాలు, ధోని వ్యక్తిగత జీవితం.. ఇవన్నీ పార్ట్ 2లో చూపిస్తారని సమాచారం. ధోనికి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ఈసారి దర్శకుడు మారే అవకాశాలున్నాయి. బయోపిక్‌లలో సీక్వెల్స్ రావడం ఇదే తొలిసారి. ఈ విషయంలో ధోని మరో రికార్డు అందుకున్నట్టే.