తెలుగు చిత్రసీమకు ఎన్నో సూపర్ హిట్లు అందించారు ఎం.ఎస్.రాజు. నిర్మాతగానే కాకుండా కథ, స్క్రీన్ ప్లే రచయితగానూ ఆయన సుప్రసిద్ధుడే. ఆ తరవాత మెగాఫోన్ పట్టారు. ఎప్పుడైతే డైరెక్షన్ వైపు చూపు మళ్లిందో అప్పుడే.. నిర్మాతగానూ ఫామ్ కోల్పోయారు. తనయుడుని హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఆస్తుల్ని కూడా అమ్ముకోవాల్సివచ్చింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారాయన. ఇప్పుడు మళ్లీ… రంగంలోకి దిగుతున్నారు.
విశ్వక్ నేన్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించడానికి ఆయన రెడీ అయ్యారు. నగరానికి ఏమైంది? సినిమాతో ఆకట్టుకున్నాడు విశ్వక్ సేన్. ఇప్పుడు తానే దర్శకుడిగా మారి ఫలక్ నామా దాస్‌ని రూపొందిస్తున్నాడు. ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై కాస్తో కూస్తో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఎమ్.ఎస్.రాజు.. ఈ యువ హీరోకి అడ్వాన్సు ఇచ్చాడు. ఈసారి ఎం.ఎస్.రాజు నిర్మాతగానే పరిమితం అవుతారా? లేదంటే రచయితగానూ పనిచేస్తారా? అనేది చూడాలి. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడ్ని టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నారు. ఇంతకాలం తనయుడిపైనే బెట్టింగ్ కాసిన రాజుగారు.. ఈసారి మరో హీరోతో ప్రయాణం చేయడానికి రెడీ అయ్యారన్నమాట.