హైదరాబాద్ రియాలిటీ లగ్జరీ పోకడలు ఎవరూ ఊహించని విధంగా ఉంటున్నాయి. తాజాగా ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ రియాల్టీలోకి వచ్చింది. తొలి ప్రాజెక్ట్ ఎంఎస్ఎన్ వన్ ను ప్రకటించింది. బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కోకాపేటలో వేలం వేసినప్పుడు ఎకరం వంద కోట్లకు కొన్న స్థలంలో ఈ ప్రాజెక్టును కడుతున్నారు. మొత్తం 7.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఉస్మాన్ సాగర్ సమీపంలోనే ఉండటంతో పై పది అంతస్తులు పైన ఉండే వారికి అద్భుతమైన వ్యూ ఉంటుంది.
భారతీయ పంచతత్వ ఫిలాసఫీ స్ఫూర్తితో ఆర్కిటెక్చర్ రూపొందించారు. 55 అంతస్తుల వరకు ఎత్తుగల ఐదు టవర్లలలో మొత్తం 655 అల్ట్రా-లగ్జరీ రెసిడెన్షియల్ యూనిట్లు ఉంటాయి. అపార్ట్మెంట్ల పరిమాణం 5,250 నుండి 7,460 చదరపు అడుగుల వరకు ఉంటుంది. – ప్రైవేట్ లాబీలు, డ్యూయల్ యాక్సెస్ పాయింట్లు, ఇండోర్-అవుట్డోర్ లేఅవుట్లతో సహజ వెలుతురు వచ్చేలా నిర్మిస్తారు. ఐదు టవర్లపై ఐదు హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు.
కొత్తగా వస్తున్న ప్రాజెక్టుల్లో ఉండే అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ సస్టైనబుల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. 30 శాతం గ్రీనరీ, ఓపెన్ లాన్స్, మానిక్యూర్డ్ గార్డెన్స్ కు వదిలేస్తున్నారు. ధరలు ఎంత అన్నదానిపై స్పష్టత లేదు. పై అంతస్తులకు వెళ్లే కొద్ది.. రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో అపార్టుమెంట్ కనీసం ఇరవై కోట్లకుపైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. నియోపోలిస్లో కొత్త ఐటీ పార్కులు, మెట్రో కనెక్టివిటీ మెరుగుదలల కారణంగా ఈ ప్రాజక్ట్ రీసేల్ విలువ గణనీయంగా పెరుగుతుందని అంచనా.