హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చటం, కాపు కమిషన్కు వేయికోట్లు కేటాయించటంపై ఉద్యమానికి దిగిన ముద్రగడ పద్మనాభం ఆమరణదీక్షకు దిగుతానని ఇవాళ ప్రకటించారు. భార్యతో కలిసి నాలుగైదు రోజుల్లో దీక్షకు కూర్చుంటానని చెప్పారు. కిర్లంపూడిలో తన స్వగృహంలో ఆయన ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఆయన చెప్పిన అంశాలు ఇలా ఉన్నాయి.
- అరెస్ట్ చేసినా జైలులో కూడా నిరాహారదీక్ష చేస్తా.
- కాపులకు న్యాయం జరిగేవరకు విశ్రమించను.
- నిన్న ఉద్యమం తప్పుదోవ పడుతోందని గ్రహించి ఆందోళనను విరమించాను.
- నిన్న జరిగిన అల్లర్ల వెనక టీడీపీ నాయకుల హస్తం ఉంది.
- అల్లరిమూకలకు నాయకత్వం వహించింది టీడీపీవారే.
- నేను అమ్ముడైపోయినట్లు ప్రచారం చేస్తున్నారు.
- నాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేశాను. ఆనాడు నన్ను మీరు ఎన్నికోట్లకు కొన్నారో చంద్రబాబు చెప్పాలి.
- నిన్న కాపుగర్జన సభను అడ్డుకోటానికి అన్ని ప్రయత్నాలూ చేశారు.
- స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇవ్వనీయకుండా చేశారు.
- వంట చేసుకోవటానికి జాగా కూడా ఇవ్వనీయలేదు.
- నిధులు లేవంటున్నారు, ప్రతిచోటకూ సీఎమ్ ప్రత్యేక విమానంలోనే తిరుగుతున్నారు.
- అమరావతి శంకుస్థాపనకు 400 కోట్లు ఖర్చుపెట్టారు, పట్టిసీమకు 1500 కోట్లు ఖర్చుపెట్టారు.
- కాపులు ఎవరూ ఆవేశానికి లోనుకావద్దు, ఇళ్ళు వదిలి ఎక్కడికీ రావద్దు. మీప్రాంతాలనుంచే సంఘీభావం ప్రకటించాలి.