ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోటాలో.. ఐదు శాతం కాపులకు ఇవ్వవొద్దని.. ఏ కోర్టు చెప్పిందని.. ముద్రగడ పద్మనాభం.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లపై.. ఏ కోర్టు స్టే ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో.. ఏదైనా కోర్టు అలాంటి స్టే ఇచ్చి ఉందని.. నిరూపిస్తే.. తాను ఐదేళ్ల పాటు.. నోటికి ప్లాస్టర్ వేసుకుని ఏమీ మాట్లాడకుండా ఉంటానని ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు… జగన్మోహన్ రెడ్డికి.. ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం… ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పది శాతం కోటాలో ఐదు శాతం… కాపులకు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతూ.. ప్రభుత్వం కాపుకోటాను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. దీనిపైనే.. ముద్రగడ.. జగన్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు.
అసలు కాపుల రిజర్వేషన్లపై… జగన్మోహన్ రెడ్డి.. తన విధానాన్ని స్పష్టం చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారు. కాపు కార్పొరేషన్‌కు.. మీరు ఇస్తామన్న.. రూ. రెండు వేల కోట్లకు ఆశ పడి.. కాపులంతా మీకు ఓట్లు వేశారా.. అని.. ముద్రగడ .. జగన్ ను లేఖలో ప్రశ్నించారు. నిత్యం మా జాతి ఓట్లు వేసి.. ఎటువంటి కోరికలు లేకుండా బతకాలా.. అని లేఖలో ముద్రగడ.. ఆక్షేపించారు. కాపు రిజర్వేషన్లను రద్దు చేస్తూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై.. గతంలో.. వీటి కోసమే ఉద్యమం చేసిన వారు పెద్దగా మాట్లాడటం లేదు. కాపు రిజర్వేషన్ల ఉద్యమానని టీడీపీ హయాంలో.. పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లిన ముద్రగడ… ఇప్పుడు లేఖ విడుదల చేశారు.
అయితే లేఖలో… చివరిలో.. జగన్మోహన్ రెడ్డికి మరో విన్నపం చేశారు. తనపై.. సోషల్ మీడియాలో.. కాపు ద్రోహి అన్నట్లుగా.. నిందలు వేస్తున్నారని… వాటిపై చర్యలు తీసుకోవలాని కోరారు. గతంలో షర్మిల ఇలాగే నిందిస్తున్నారని హైదరాబాద్ లో కేసులు పెట్టారని.. తనను కూడా అలాగే భావించి.. తనపై సోషల్ మీడియాలో దూషించేవారిపై కేసులు పెట్టాలని ప్రత్యేకంగా బాక్స్ కట్టి మరీ రాసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.