కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం నిన్న ఉదయం మీడియా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. “చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల విలువగల ఆస్తులు ఏవిధంగా సంపాదించగలిగారో మాకూ చెప్పగలిగితే రిజర్వేషన్ల కోసం ఎవరూ పోరాడవలసిన అవసరమే ఉండదు,” అని అన్నారు.
కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ ఒకవైపు ముఖ్యమంత్రి ప్రతినిధులతో చర్చలు కొనసాగిస్తూ మళ్ళీ ఇటువంటి అప్రస్తుత విషయాల గురించి మాట్లాడటం సరికాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు. ఆయన ముఖ్యమంత్రికి మంచి పంచ్ డైలాగ్ కొట్టినా, అటువంటివి చర్చలు విఫలమయి ఉద్యమం ఉదృతం అయినప్పుడు అని ఉంటే సమయోచితంగా ఉండేది. ఇటువంటి సమయంలో ఆయన కొంచెం సంయమనంగా వ్యవహరిస్తూ, పట్టువిడుపులు ప్రదర్శిస్తూ తన ఆశయ సాధనకు కృషి చేయాలి తప్ప ముఖ్యమంత్రిపై తనకున్న వ్యక్తిగత అభిప్రాయాల గురించి మాట్లాడి
సమస్యను జటిలం చేసుకోకూడదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు.