పద్మనాభ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు లేఖ రాశారు. తనకు వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతను అధికారంలోకి వచ్చేంతవరకు కృషి చేస్తానని లేఖలో పేర్కొన్నారు. చివర్లో పద్మనాభ రెడ్డి అని సంతకం కూడా చేశారు.
30మందితో వైసీపీ పీఏసి కమిటీని ప్రకటించారు జగన్. అసలు ఈ పీఏసీ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్క సజ్జలకు తప్ప. వైసీపీ ఘోర పరాభవానికి మూలకారకుడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డినే ఈకమిటీ చైర్మన్ గా నియమించారు జగన్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ చేసి, ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న పద్మనాభంకు కమిటీలో చోటు కల్పించారు.
ఇప్పటికే వైసీపీ కీలక నేతలు తలో దిక్కు చేరిపోయారు. అధికారంలో ఉండగా ప్రతిపక్ష నేతలపై బూతుపురాణం అందుకునే నేతలు అజ్ఞాతవాసం గడుపుతున్నారు. మరికొంతమంది కేసుల భయంతో సైలెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీకి కాపు సామాజిక వర్గం ఓట్లు మలపాలని విఫలయత్నం చేసిన ముద్రగడ కూడా సైలెంట్ గానే ఉన్నారు.
వైసీపీ రాజకీయాలతో ముద్రగడ కూడా ఏమైనా మనసు మార్చుకుంటారేమో అనుకున్నట్టు ఉన్నారు. ఏమాత్రం ప్రాధాన్యం ఉండని వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ముద్రగడకు స్థానం కల్పించారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్న ముద్రగడ సూచనలను పీఏసి పరిగణనలోకి తీసుకుంటుందా ? అంటే నో అంటూ ఎవరైనా ఇట్టే చెప్పగలరు. ఎందుకంటే.. వైసీపీకి సకల శాఖాధిపతి సజ్జల ఉండగా.. జగన్ మరికొరికి ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి.