పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన మిషన్ కంప్లీట్ కావడంతో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఆయన తన రేంజ్ ను ఓ రేంజ్ లో ఊహించని తనకు ఎంపీ సీటు.. తన కొడుక్కు ఎమ్మెల్యే సీటు అన్నట్లుగా గాల్లో తేలేవారు. కానీ అంత సీన్ లేదని .. వైసీపీ నాయకత్వం తేల్చేసింది. మళ్లీ గెలిస్తే ఏదో ఓ పదవి ఇస్తామని పార్టీలో చేరిపోవాలని చెప్పడంతో ఆయన ఓకే చెప్పారు. పధ్నాలుగో తేదీన తాడేపల్లి వెళ్లి జగన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకుంటున్నానని.. తనతో పాటు వచ్చే వారు రెడీ అవ్వాలని పిలుపునిచ్చారు.
నిజానికి ముద్రగడ .. 2014 తర్వాత వైసీపీ కోసం చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. ముసుగులో పోరాటమే అయినా కాపుల్ని .. టీడీపీకి వ్యతిరేకం చేయడంలో.. సక్సెస్ అయ్యారు. చివరికి కాపులకు చంద్రబాబు ఐదు శాతం రిజర్వే,న్లు ఇచ్చినా ఆయనకు గొప్పగా అనిపించలేదు. జగన్ రెడ్డి రాగానే ఆ ఐదు శాతం రిజర్వేషన్లు తీసేసినా నోరు మెదపలేదు. పైగా ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తున్నారా.. ఇస్తారా.. ఇవ్వరా అనే షరతులు లేకుండా భేషరతుగా పార్టీలో చేరిపోతున్నారట.
కాపుల్ని ఇంతగా మోసం చేసింది ముద్రగడ అయితే.. ఆయన పవన్ ను కాపుల పేరుతో బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించడమే అసలైన రాజకీయం. పవన్ కల్యాణ్ ను ఒక్క కాపులకే ప్రతినిధిని చేయడానికి .. వైసీపీతో కలిసి ముద్రగడ రాజకీయ పరమైన కుట్ర చేశారన్న అనుమానాలు ఈ కారణంగానే జనసైనికుల్లో వస్తున్నాయి. కారణం ఏదైనా ముద్రగడను ఇంటికెళ్లి పిలిచి నెత్తి మీద పెట్టుకుంటే… ఇప్పటికే కుంపటి పెట్టేసేవాడని పవన్ మంచి పని చేశారని… జనసైనికులు సంతృప్తి చెందుతున్నారు.