గజదొంగ, కులద్రోహి అంటున్నారని.. ఆ ఆవేదన భరించలేని.. అందుకే కాపు ఉద్యమం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని… ముద్రగడ పద్మనాభం ప్రకటన చేశారు. ఈ మేరకు..బహిరంగ లేఖ విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి సర్కార్ తొలగించింది. ఆ విషయంపై ముద్రగడ పద్మనాభం సైలెంట్‌గా ఉండటమే కాక.. రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉన్నదన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ మేరకు జగన్‌కు లేఖ రాసి..మోడీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కేంద్రం ఇచ్చే రిజర్వేషన్ల తరహాలో… EWS కోటా కింద వచ్చే పది శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం చంద్రబాబు కేటాయించారు. అవి అయినా రిజర్వేషన్లు.. వాటిని ఏపీ సర్కార్ అమలు చేయడానికి అధికారం ఉంది.
అయినప్పటికీ.. జగన్‌పై ఒత్తిడి తీసుకు రాకపోవడంతో ముద్రగడపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. వైసీపీపై.. జగన్ పై ఈగ వాలకుండా ఆయన కవరింగ్ లెటర్లు కూడా రాస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై.. కాపు నేతలు.. ఉద్యమ సంఘాలు… తీవ్రంగా మండి పడుతున్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతిఫలం తీసుకుని.. కాపు జాతికి అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ.. టీవీ చర్చల్లోనూ.. ముద్రగడ తీరుపై… తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇవన్నీ.. ముద్రగడ దృష్టికి వెళ్లాయేమో కానీ.. తాను ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాసిన లేఖలో.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. తాను కదిలించిన రిజర్వేషన్ ఉద్యమం గురించి గొప్పగా చెప్పుకున్నారు.
మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరేడు నెలల్లోనే… కాపు రిజర్వేషన్ అంశం పట్టుకుని తెరపైకి వచ్చి.. నాలుగున్నరేళ్ల పాటు కావాల్సినంత.. రాజకీయ ఉద్రిక్తత తెచ్చి పెట్టిన ముద్రగడ… ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం సైలెంటయిపోయారు. చేతిలోకి వచ్చిన రిజర్వేషన్ తీసేసినా.. కార్పొరేషన్ పేరుతో.. అందరికీ ఇచ్చే పథకాలనే కాపులకూ.. ఇస్తూ.. అన్యాయం చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా ఆయన స్పందించడం లేదు. చివరికి.. ఈ గొడవ అంతా ఎందుకనుకున్నారేమో కానీ… మొత్తానికే కాడి దించేశారు. బహుశా.. మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే.. ఆయన మళ్లీ యాక్టివ్ అవుతారేమోనని.. ఇతరుల నుంచి సెటైర్లు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి.