ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ వాదంతో విబేధిస్తూ వీడయో విడుదల చేశారు. ఆ వీడియో ముద్రగడ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో ముద్రగడ పద్మనాభం తన కుమార్తెను ప్రాపర్టీతో పోల్చారు. ఇంటి ఆడపడుచును.. తన కడుపున పుట్టిన పిల్లలను ప్రాపర్టీతో పోల్చడమేంటో అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది.
పెళ్లి అయ్యే వరకూ తన కుమార్తె తన ప్రాపర్టీ అని.. పెళ్లి చేసి పంపేసిన తర్వాత తన ప్రాపర్టీ కాదని ఆయన గొప్పగా తన కుమార్తెకు కౌంటర్ ఇచ్చినట్లుగా మాట్లాడారు. ఈ స్పందన చూసి పక్కనున్న వారికే మైండ్ బ్లాంక్ అయింది. అదే సమయంలో తన కుమార్తె స్పందన చూసి బాధపడతాను కానీ భయపడనని చెప్పుకొచ్చారు. అసలు భయపడటం ఏమిటో అని అందరూ బుర్ర గోక్కోవాల్సి వచ్చింది.
జగన్ తో కలవడం ద్వారా ముద్రగడ తన రాజకీయ ఇమేజ్ మొత్తం పూర్తిగా దిగజార్చుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు జగన్ కోసం సొంత కుటుంబసభ్యులపై .. అది కూడా కుమార్తెపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఏమిటన్న ప్రశ్న యనకు వస్తోంది. పెద్ద పెద్ద లేఖల్లో కూడా అండీ అండీ అంటూ దీర్ఘాలు తీసే ముద్రగడ ఆడపిల్లల విషయంలో ఇంత సంకుచితంగా ఉంటారని తేలిపోయిందన్న అభఇప్రాయం వినిపిస్తోంది. పవన్ ను ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పిన వ్యక్తి నుంచి ఇంతకు మించి సంస్కారం ఆశించగలమా.. అని సొంత కులస్తులే ఫీలవుతున్నారు. అదేదో రెడ్డి తప్పుడు కులం అయినట్లుగా తేల్చేశారని ఆ వర్గమూ నిష్ఠూరమాడుతోంది అది వేరే విషయం.