ముద్రగడ పద్మనాభం రేపటి నుండి చేయ తలబెట్టిన ఆమరణ నిరాహార దీక్షను వాయిదా వేసుకొన్నారు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున దీక్ష విరమించుకోవాలని పోలీస్ అధికారులు అభ్యర్ధించినపుడు మొదట అంగీకరించలేదు కానీ తరువాత తన దీక్షను వాయిదావేసుకొంతున్నట్లు ప్రకటించారు. తన దీక్ష వలన కాపులకు మేలు జరగాలని కోరుకొంటున్నానే తప్ప విద్యార్ధులకు ఇబ్బంది కలిగించాలనుకోవడం లేదని అందుకే దీక్షను వాయిదా వేసుకొంటున్నట్లు ప్రకటించారు. నిజంగా అదే కారణమయితే మంచిదే. ఈరోజు బడ్జెట్ లో కాపు కార్పోరేషన్ కి ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిన తరువాత ఆయన దీక్షకు సిద్దపడటంతో అప్పుడే విమర్శలు వెల్లువెత్తడం మొదలయ్యాయి. బహుశః ఆ విమర్శలకు భయపడే ఆయన తన దీక్షను విరమించుకొని ఉండవచ్చునేమో?