హైదరాబాద్: ఆమరణ నిరాహారదీక్ష విరమించిన ముద్రగడ దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు. ఎప్పుడు దీక్ష చేసినా సైనైడ్ గుళికలు, పురుగుల మందు, గ్యాస్, పెట్రోల్ అన్నీ దగ్గర పెట్టుకునే కూర్చుంటానని తెలిపారు. గతంలోకూడా ఇలాగే చేశానని వెల్లడించారు. ఇదే ఆఖరిపోరాటం అనుకున్నానని, ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డానని చెప్పారు. ఈ దీక్షకు ముందు ఆస్తి పంపకాలు పూర్తి చేసేశారని, వీలునామా రాశారని వచ్చిన వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా ముద్రగడ ఈ విషయాలను బయటపెట్టారు. ముద్రగడ గతంలో రివాల్వర్, తుపాకి కూడా పక్కన పెట్టుకుని ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టిన సందర్భాలున్న విషయం తెలిసిందే.