టీడీపీ లేదా జనసేనలో చేరుతాను.. మీ పార్టీలోకి రాను పొండి అని వైసీపీ నేతల్ని ముద్రగడ కసురుకున్నారని మీడియాలో బ్రేకింగ్‌లు చూసి రాజకీయాల్ని ఫాలో అయ్యే చాలా మంది వాంతులు చేసుకుని ఉంటారు. గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి కోసం పని చేసి… పవన్ కల్యాణ్‌ను సైతం సవాల్ చేసి.. దమ్ముంటే పోటీకి రా అని వాగేసిన ముద్రగడ నోటి నుంచి టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తానని రావడం ఆశ్చర్యకరమే మరి. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు మహదానందపడుతూ ఆయన రాసిన లేఖల్ని ఎవరూ మర్చిపోలేరు.
కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ఆయన గత టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కుట్రలు చేశారు. అయినా చంద్రబాబు కక్,సాధింపులకు పాల్పడలేదు. ఐదు శాతం రిజర్వేషన్లు చంద్రబాబు ఇచ్చారు. అవి చెల్లుతాయని కేంద్రం కూడా చెప్పింది. అయినా వాటిని అమలు చేయాలని జగన్ రెడ్డిని ఒక్క మాట కూడా అడగలేదు ముద్రగడ. పైగా సందర్భం వచ్చినప్పుడల్లా కాపులు తన వెంటనే ఉంటారన్నట్లుగా పవన్ కల్యాణ్ ను కించ పరుస్తూ వస్తున్నారు.
ఇప్పుడు జగన్ రెడ్డి పూర్తిగా హ్యాండిచ్చారు. టిక్కెట్ ఇచ్చి మరీ ఖర్చులకు డబ్బులిస్తామని రాయబారం పంపి తర్వాత లైట్ తీసుకున్నారు. ఆయన అవసరం లేదని తేల్చేసుకున్నారు. వాడేసుకున్న తర్వాత రోడ్డున పడేశారని ముద్రగడకు అర్థం అయిన తరవాత ఇప్పుడు… టీడీపీ, జనసేన అంటున్నారు. ముద్రగడ నోటి వెంట టీడీపీ అనే మాటే రాకూడదు. కానీ వస్తోంది. అదే రాజకీయం అని అనుకోవాలేమో ?