గురువారం సాయంత్రంలోగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం నిర్దిష్టమయిన హామీ ఇవ్వకపోతే శుక్రవారం ఉదయం నుంచి తాను తన భార్య కలిసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొంటామని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నవారందరిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. తాము అరెస్టులకు భయపడబోమని, అరెస్ట్ చేస్తే జైల్లోనే నిరాహార దీక్షను కొనసాగిస్తాము తప్ప బెయిల్ కూడా కోరమని ఆయన తెలిపారు. తనతోబాటు వేలమంది కాపులు అరెస్ట్ అవడానికి సిద్దంగా ఉన్నారని, పోలీసులు ఎంతమందిని కావాలంటే అంతమందిని అరెస్ట్ చేసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ముద్రగడ పద్మనాభం తెలిపారు.