రివ్యూ: ముఖచిత్రం

mukhachitram movie telugu review

తెలుగు360 రేటింగ్ 1.5/5

హీరో విశ్వక్ సేన్ లాయర్ గా అతిధి పాత్రలో కనిపించాడు.. సినిమా బండి చిత్రంతో ఆకట్టుకున్నాడు వికాస్‌ వశిష్ట… కలర్ ఫోటో సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న సందీప్‌ రాజ్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించాడు… ఇవన్నీ.. ‘ముఖచిత్రం’ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ట్రైలర్ కూడా క్యూరియసిటీని పెంచింది. ఇప్పటి వ‌ర‌కూ ఎవ‌రూ సినిమాల్లో చెప్ప‌ని.. సోషల్ ఇష్యూని ట‌చ్ చేశామ‌ని చిత్ర బృందం ముందు నుంచీ చెబుతూనే వ‌చ్చింది. మారి ఆ ప్రయత్నం ఎంతవరకు ఆకట్టుకుంది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ?

డాక్టర్ రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట) హైదరాబాద్ లో ఫేమస్ ప్లాసిక్ట్ సర్జన్. మయా ఫెర్నాండెజ్ (అయేషా ఖాన్ ) కథా రచయిత. సినిమాల్లో ప్రయత్నిస్తుంటుంది. రాజ్ కుమార్, మాయా చిన్నప్పటి నుంచి స్నేహితులు. రాజ్ అంటే మయాకి ఇష్టం, ప్రేమ. కానీ రాజ్ కుమార్ కి మాత్రం మయాపై అలాంటి ఫీలింగ్ వుండదు. మహతి (ప్రియా వడ్లమాని) సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. తల్లి తండ్రులలతో కలసి విజయవాడలో ఉంటూ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి పిల్లలకు ట్యూషన్ చెబుతుంటుంది. పెళ్ళిళ్ళ బ్రోకర్ నుంచి మహతి ఫోటో రాజ్ కుమార్ కి వస్తుంది. మహతి చూసిన రాజ్ కుమార్.. ఆమెనే పెళ్ళాడాలని నిర్ణయించుకుంటాడు. మహతికి కూడా రాజ్ కుమార్ నచ్చేశాడు. పెళ్లి చేసుకొని ఎంతో అనోన్యంగా జీవితం మొదలుపెడతారు. రోజులు గ‌డుస్తాయి. ఒక రోజు మాయా రోడ్డు ప్రమాదానికి గురౌతుంది. మాయ మొహం నుజ్జునుజ్జైపోతుంది. తర్వాత రోజే మహతి మెట్లపై నుంచి జారి కిందపడి మరణిస్తుంది. మహతిని ఎలాగైనా బ్రతికించుకోవాలని భావించిన రాజ్ కుమార్.. మహతి ముఖాన్ని మాయాకి ట్రాన్స్ ప్లాంట్ చేస్తాడు రాజ్ కుమార్. మహతికి మారిన మాయ ఏం చేసింది ? తన జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ? మహతిది సహజ మరణమా లేదా దాని వెనుక ఏదైనా కుట్రదాగి ఉందా ? అనేది మిగతా కథ.

సామాజిక సమస్యని ఒక థ్రిల్లర్ నేపధ్యంలో చెప్పే కథ ఇది. కోర్టు లో కేసు వాదనకు రావడంతో కథ మొదలుతుంది. అయితే అసలు కథలోకి వెళ్ళడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు దర్శకుడు. ప్రధాన పాత్రల పరిచయం, రాజ్ కుమార్ , మహతిల పెళ్లి చూపులు, పెళ్లి.. ఇవన్నీ నిదానంగా వుంటాయి. మయా యాక్సిడెంట్, మహతి చావు తో కథలో సీరియస్ నెస్ వస్తుంది. అయితే కథలో పెద్ద మలుపు లేకుండానే ఇంటర్వెల్ బాంగ్ పడిపోతుంది. నిజం చెప్పాలంటే అసలు కథ అంతా రెండో సగానికే దాచేశాడు దర్శకుడు. మహతి చావు వెనుక ఎదో ట్విస్ట్ ఉటుందని అర్ధమౌతూనే వుంటుంది. సెకండ్ హాఫ్ ని నడిపింది ఆ ట్విస్ట్ నే. ట్విస్ట్ ని రివిల్ చేసిన విధానం బాగానే వుంటుంది. అయితే దాని తర్వాత కథలో వచ్చిన మలుపుని సరిగ్గా వాడుకోలేపోయారనిపిస్తుంది.

ఒక మిస్టరీ చావుని కోర్ట్ రూమ్ డ్రామాకి కనెక్ట్ చేసి సామజిక సమస్యని చర్చించడం.. ఈ కథలో సరిగ్గా అతకలేదు. మహతి చావు విషయంలో పాత్రలన్నీ మితిమీరిన సినిమాటిక్‌ లిబార్టీ తీసుకున్నాయనే భావన కలుగుతుంది. గృహ హింస, మారిటల్ రేప్ లాంటి అంశాలు కోర్ట్ రూమ్ డ్రామాలో వాదనలుగా వినిపించారు. నిజానికి అవి చాలా సీరియస్ స‌మస్య‌లు. అయితే దర్శకుడు వేసుకున్న సెటప్ కి, ఆ కోర్టు రూమ్ డ్రామాకి కనెక్షన్ కుదరలేదు. కోర్టులో జరిగిన వాదనలు కూడా పెద్దగా రక్తికట్టలేదు. నిజానికి ఆ సమస్యని అడ్రస్ చేయడానికి కోర్ట్ సెటప్ కూడా అవసరం లేదు. మాయ పాత్రని వాడుకొని దాన్ని రివెంజ్ డ్రామాగా మార్చి స్త్రీ పాత్రతో ఆ సందేశం చెప్పివుంటే కూడా ప్రభావంతంగా వుండేది.

వికాస్ వశిష్ట సహజంగా నటించాడు. తనలో మంచి ఈజ్ వుంది. మహతి పాత్రలో ప్రియావడ్లమాని ఆకట్టుకుంది. వైవిధ్యమైన పాత్ర అది. ఒకే పాత్రలో సంప్రదాయ, ఆధునిక కోణాలు ఆవిష్కరించే అవకాశం వున్న పాత్ర. ప్రియా అందం అభినయంతో ఆకట్టుకుంది. మయా ఫెర్నాండెజ్ గా చేసిన అయేషా ఖాన్ కి కూడా మంచి మార్కులు పడతాయి. సెకండ్ హాఫ్ లో తన రూపం కనిపించపోయినా తన వ్యక్తిత్వంతోనే కథ నడిచింది. విశ్వక్ చేసింది చిన్న పాత్రే అయినా అలరించింది. విశ్వక్ లాంటి నటుడు వున్నప్పుడు కోర్ట్ రూమ్ డ్రామాని మరి కాస్త ఆసక్తిగా రాసుకోవాల్సింది. విశ్వక్ లాయర్ బోనులో నిలబడి చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటాయి. లాయర్ వశిష్ట గా చేసిన రవిశంకర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. తన వాయిస్ అదనపు ఆకర్షణ. తండ్రి పాత్రలో మీర్ హుందాగా చేశారు. చైనత్య, సునీల్ మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.

నిర్మాణ పరంగా సినిమాలో పరిమితులు కనిపిస్తాయి. విజువల్స్ సాధారణంగానే వున్నాయి. రెండు పాటలు వున్నాయి. అయితే అవి గుర్తుపెట్టుకునే పాటలైతే కాదు. నేపధ్య సంగీతం ఓకే. ”ఎక్కడైన రేప్ కి గురైతే కేసు పెడతారు. కానీ ఇంట్లో చాలా మంది మహిళలు రోజూ అత్యాచారానికి గురౌతూ తిరిగి ఉదయాన్నే అత్యాచారం చేసిన వాళ్ళకే దోసెలు వేసి పెడతారు. దీని కంటే రేప్ బెటరు” అనే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. ‘ముఖచిత్రం’ కోసం ఎత్తుకున్న పాయింట్ బావుంది. అయితే దాన్ని యంగేజింగా రక్తికట్టించేలా చెప్పడంలో తడబాటు కనిపించింది.

తెలుగు360 రేటింగ్ 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close