ప్రపంచ కుబేరుల సంపద… కరోనా దెబ్బకు కరిగిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత ధనికులుగా పేరు పొందిన వారి ఆస్తులు.. కళ్ల ముందే తగ్గిపోతున్నాయి. భారత్‌లోనే అత్యంత ధనవంతుడు.. ప్రపంచంలో టాప్ టెన్ కుబేరుల్లో ఒకరిగా కిరీటం దక్కించుకున్న ముకేష్ అంబానీకి ఇప్పుడు.. ఆ హోదా లేదు. కరోనా కారణంగా కరిపోతున్న ఆర్థిక వ్యవస్థలు.. స్టాక్ మార్కెట్ల కారణంగా..ఆయన సంపద… తగ్గిపోయింది. గత నెల వారాల కాలంలో ఆయన రూ. లక్షా నలభై వేల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో ఆయన స్థానం ప్రపంచ కుబేరుల జాబితాలో 9 నుంచి పదిహేడో జాబితాకు చేరింది. ప్రస్తుతం ఆయనకు రూ. మూడునన్నర లక్షల కోట్ల సంపద ఉండవచ్చని అంతర్జాతీయ బిజినెస్ మ్యాగజైన్ హురూన్ అంచనా వేసింది.
అయితే.. దేశంలో ఆయన తిరుగులేని కుబేరునిగానే సాగుతున్నారు. ఎందుకంటే.. ఆయనతో పోటీగా ఉన్న బిజినెస్ కింగ్‌ల వ్యాపారాలు కూడా తగ్గిపోయాయి. నిజం చెప్పాలంటే.. అంబానీ కంటే ఎక్కువ నష్టపోయిన వాళ్లు ఉన్నారు. ఆదానీ గ్రూప్ ఓనర్ గౌతం అదానీ ముఖేష్ కన్నా ఎక్కువ సంపద పోగొట్టుకున్నారు. ఆయన సంపద 6 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ఇక హెచ్‌సీఎల్ టెక్ శివ్ నాడార్ 5 బిలియన్ డాలర్లు, కోటక్ గ్రూప్‌నకు చెందిన ఉదయ్ కోటక్ బిలియన్ డాలర్లు కోల్పోయారు. స్టాక్ మార్కెట్ సంపద మొత్తం యాభై శాతం వరకూ కరిగిపోయింది కాబట్టి.. వీరి సంపదంలో ఈ మాత్రం తేడా రావడం సహజమేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే.. ఈ కుబేరులకు వచ్చిన ఈ నష్టంతో… వారికి పోయేదేమీ లేదు. ఈ సంపద కరిగిపోవడం పూర్తిగా స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. రేపు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టారన్న విషయం బయటకు రాగానే.. ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఒక్క సారిగా ఊపందుకుంటాయి. అదేజరిగితే.. ఈ కుబేరుల సంపద.. ఇప్పుడు కోల్పోయిన దాని కన్నా.. రెండింతలు పెరుగుతుంది. అయితే.. ఈ కరోనా వల్ల.. ఆయా సంస్థల వ్యాపార, ఆర్థిక వ్యవహారాలు దెబ్బతింటేనే కోలుకోవడం కష్టం అవుతుంది.