ఓరీ జాత్యహంకారీ ట్రంప్.. అనాథలా కుక్క చావు చస్తావు… అంటూ సిద్ధాంతి ములుగు శపించారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పంచాంగకర్త, ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శపించారు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలకు కష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు.
ప్రవాస భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార దాడులు ఎక్కువై పోయాయి. గత వారం రోజుల్లోనే ముగ్గురు భారతీయులపై దాడి జరిగింది. ఇది భారతీయులను తీవ్రంగా కలిచివేసింది. ఈ పరిణామాలన్నీ ములుగు రామలింగేశ్వర ప్రసాద్ ఆగ్రహం తెప్చించాయి. దీంతో ఆయన డోనాల్డ్ ట్రంప్‌ను శపించారు. ట్రంప్‌ను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుక్క చావు చస్తాడంటూ శాపనార్థాలు పెట్టారు. ట్రంప్ జాతక చక్రం ప్రకారం, ఏలినాటి శని నడుస్తోందని, దీని ప్రభావంతో ఆయన పూర్తి కాలం పాటు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగలేరని జోస్యం చెప్పారు. “ఓరీ జాత్యహంకారీ డోనాల్డ్ ట్రంప్… నీవల్ల నిష్కారణంగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పాపం నీకు తప్పకుండా తగులుతుంది. నీవు చేసినటువంటి పాపాలకు ఫలితం చెబుతున్నా విను. ఇదే నేను నీకు ఇచ్చే శాపం. నీ అంత్య కాలంలో, నీ మరణ సమయంలో, నీ సన్నిహితులుగానీ, నీ మిత్రులుగానీ, నీ భార్యగానీ, నీ బంధువులుగానీ ఎవ్వరూ లేకుండా, అనాథలాగా కుక్క చావు చస్తావు. నా మాటకు తిరుగులేదు” అంటూ శపించారు.
Mahesh Beeravelly