ఐపీఎల్ ఛాంపియన్ గా మరోసారి ముంబై ఆవిర్భవించింది. ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన ఫైనల్ లో 5 వికెట్ల తేడాతో.. గెలిచి, ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. 22 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ని పంత్ (56), శ్రేయాస్ (65 నాటౌట్)గాడిన పెట్టారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో… 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. బోల్ట్ 3 వికెట్లు పడగొట్టి, ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అనంతరం బ్యాటింగ్ దిగిన ముంబై… ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అందుకుంది. ఈ ఐపీఎల్ లో అంచనాల మేరకు రాణించకపోయిన రోహిత్ శర్మ ఫైనల్లో మాత్రం విజృంభించాడు. 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు. డికాక్ (20), ఇషాన్ కిషన్ (33 నాటౌట్) రాణించారు. డిల్లీ బౌలర్లలో రబడాకి ఒక వికెట్, నౌర్టోజీ కి 2 వికెట్లు దక్కాయి. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసినందుకు గానూ…. కె.ఎల్.రాహుల్ కి ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసినందుకు రబడాకు పర్పుల్ క్యాప్ దక్కాయి.