కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ జట్టు ఎంపికలో సినియారిటికీ ఎంత ప్రాధన్యత ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీయల్ లో మంచి ఆట తీరు కనబరుస్తున్న చాలా మంచి కుర్ర ఆటగాళ్ళకి స్థానం దొరకలేదు. యశస్వి జైస్వాల్, శివం దూబే జట్టులో వుండటం కొంత కొత్తదనం తీసుకొచ్చింది.
అయితే ఈ జట్టు ఎంపికలో ఫ్యాన్స్ ని ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు కలవరపెడుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు అంటే అదొక సెమీ ఇండియా జట్టే. దేశానికి ఆడే మెజార్టీ ఆటగాళ్ళు ఆ జట్టులోనే వుంటారు. ఈ వరల్డ్ కప్ ఎంపిక చేసిన జట్టులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్ళకి అవకాశం దొరికింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్.. ఈ నలుగు ఆటగాళ్ళు బిసిసిఐ ప్రకటించిన జట్టులో వున్నారు. ఈ నలుగురూ తుది జట్టులో వుంటారు. మ్యాచ్ లో దిగుతారు.
ప్రస్తుతం ఈ నలుగురి ఫామ్ ఫ్యాన్స్ ని బయపెడుతుంది. ఒక్క బుమ్రా తప్పితే మిగతా ముగ్గురిలో నిలకడ లేదు. రోహిత్ శర్మ పవర్ ప్లే లో సర్కిల్స్ లోనే దొరికిపోతున్నాడు. గాయం నుంచి కోల్కొని జట్టులోకి వచ్చిన సూర్య ఒక్క మ్యాచ్ లో తప్పితే మిగతా అన్ని మ్యాచుల్లో సింపుల్ గా వికెట్ సమర్పించుకుంటున్నాడు. హార్దిక్ పాండ్యా ఆట మర్చిపోయినట్లు ఆడుతున్నాడు. ఈ నలుగురూ లీడ్ చేస్తున్న ముంబై జట్టు ప్రస్తుత ఐపీఎల్ పాయింట్ల పట్టికలో పాతాళానికి పడిపోయింది. ఇదే టీంమిండియా ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది. ఇలాంటి ఫామ్ తో కప్పుని కొట్టగలరా? ప్రశ్న ఉత్పన్నమౌతోంది. కాగా, ఈ నలుగురు కూడా అంతర్జాతీయ వేదికలపై మంచి ఆట కనబరిచే ఆటగాళ్ళు. వారి అనుభవంతో జట్టుని ముందుకు నడిపే సత్తా వాళ్ళలో వుందని మరో అభిప్రాయం వ్యక్తమౌతోంది.