హుజూర్ నగర్ పోలింగ్ అలా ముగియగానే.. ఇలా మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభమయింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ వార్డుల విభజన, రిజర్వేషన్లకు సంబంధించి పలువురు హైకోర్టులో పిటిషన్లును కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికలకు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమయింది. తెలంగాణాలో మున్సిపాలిటీల పదవీకాలం జూలై మొదటి వారంలో ముగిసింది. ముందుగా గడువులోగానే ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు సీఎం కేసీఆర్. కానీ కొత్త మున్సిపల్ చట్టం కోసం.. కాస్త ఆలస్యం చేశారు. ఈ లోపు వివిధ మున్సిపాల్టీల్లో రిజర్వేషన్లపై అనేక పిటిషన్లు పడ్డాయి.
మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితులు టీఆర్ఎస్ కు పరిస్థితి ఏకపక్షంగా ఉండే అవకాశాలు లేవన్న గుబులు టీఆర్ఎస్లో మొదటి నుంచి ఉంది. అయితే.. హుజూర్ నగర్లో అనుకూల పరిస్థితి ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో… వీలైనంత త్వరగా పోలింగ్ నిర్వహించేలా.. మున్సిపల్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 132 మున్సిపాలిటీ లు, ఆరు కార్పొరేషన్స్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అనుకూలత, ప్రతికులతలపై ఆ పార్టీ నాయకత్వం సర్వే చేయించింది. ఈ సర్వేలో ఉత్తర తెలంగాణలో కాస్త పోటీ ఉందున్నారు. సర్వే ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన చోట… నేతలను.. కేటీఆర్ మరింత అప్రమత్తం చేస్తున్నారు. తాండూరు, వికారాబాద్, మేడ్చల్ మున్సిపాలిటీ ల్లో నేతలు అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు. బిజెపి ఎంపిలున్న చోట ప్రత్యేక దృష్టి సారించాలని కేటిఆర్ చెప్పటం వెనుక ఆంతర్యం సర్వే ఫలితాలే కారణమని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం బ్యాలెట్ పత్రాలను స్థానికంగా ముద్రించుకోవచ్చని ఆదేశాలిచ్చింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్‌తోపాటు పలు కార్పొరేషన్లలో ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించారు. కానీ ఇప్పుడు మాత్రం బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే… మండల, జడ్పీటీసీ ఎన్నికలు.. బ్యాలెట్లతో జరిగాయి. మున్సిపల్ ఎన్నికలు కూడా అలాగే జరిగితే.. ఎవరి బలం ఎంతో తేలిపోతుందనే భావనలో టీఆర్ఎస్ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది.