మనుగోడులో బీజేపీని గెలిపించే బాధ్యతను సునీల్ భన్సల్కు హైకమాండ్ ఇచ్చింది. ఆయన ఇక్కడకు వచ్చి మొత్తం ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరో నలభై రోజుల్లో ఉపఎన్నిక వస్తందని క్లారిటీ ఇచ్చేశారు. ఉపఎన్నిక ఎప్పుడు అని.. రాజకీయ పార్టీలన్నీ కంగారు పడుతున్నాయి. ఎంత కాలం మునుగోడులో సమయం కేటాయించాలని తంటాలు పడుతున్నాయి. అయితే బీజేపీ కూడా అదే ఆలోచిస్తోంది. వీలైనంత త్వరగా ఉపఎన్నిక పూర్తి చేసి.. ఫైనల్ కోసం రంగంలోకి దిగాలని అనుకుంటోంది. అందులో ఈ నెలలోనే షెడ్యూల్ ప్రకటించి.. వచ్చే నెల మొదటి వారంలో పోలింగ్ జరిగేలా చూడాలనుకుంటోంది.
సునీల్ భన్సల్ ఆషామాషీగా చెప్పరు. మొత్తం ఎప్పుడు ఎన్నిక జరిగితే ఎవరికి లాభమో డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఆయన ఈ మాటలు చెప్పి ఉంటారని భావిస్తున్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు సీరియస్గా తీసుకుంటున్నాయి. ఇక నుంచి మునుగోడులో పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరపున విస్తృతంగా తిరుగుతూ.. విపరీతంగా ఖర్చు పెట్టి చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. వారంతా ఓట్లు వేస్తారో లేదో కానీ.. ఇప్పటికైతే కండువాలు కప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అదే పనిలో ఉన్నారు.
అభ్యర్థిని ఖరారు చేయడంతో ఆమె విస్తృతంగా తిరుగుతున్నారు. టీఆర్ఎస్ తరపున కూడా అభ్యర్థి ఖరారరయ్యారు కానీ.. అధికారికంగా ప్రకటించలేకపోతున్నారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా సునీల్ భన్సల్ ఓ తెలంగాణ రాజకీయ పార్టీలన్నింటికీ ఓ సందేశం ఇచ్చారని అనుకోవచ్చు.