తెలుగు సినిమా చరిత్రలోని అత్యుత్తమ చిత్రాల్లో ‘పాతాళభైరవి’ది ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆ సినిమా గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో ఆ సినిమా ప్రస్తావన లేకుండా ఎలా వుంటుంది? వుంటుంది కదా! అలాగే, ఆ సినిమా నిర్మాతల ప్రస్తావన కూడా వుంటుంది కదా! ‘పాతాళ భైరవి’కి ఇద్దరు నిర్మాతలు. ఒకరు బీఎన్ రెడ్డి. మరొకరు ఆలూరి చక్రపాణి. ఇద్దరూ మంచి స్నేహితులు. విజయ ప్రొడక్షన్స్ సంస్థ స్థాపించి ఎన్నో మంచి సినిమాలు తీశారు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో ఆయన పాత్రను మురళీశర్మ చేస్తున్నారు. ఇదే ఆలూరి చక్రపాణి పాత్రను సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో ప్రకాష్ రాజ్ చేశారు. రెండు సినిమాల్లో ఇద్దరి పాత్ర, సన్నివేశాలు వేర్వేరుగా వుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే… ఇద్దరూ మంచి నటులే. ఎవరి శైలి వారిది. ఆలూరి చక్రపాణిగా ప్రకాష్ రాజ్ మెప్పించారు. మరి, మురళీశర్మ ఎలా చేస్తారో?