సౌత్ ఇండియన్ దర్శకులపై షారుక్ ఖాన్ దృష్టి పడింది. ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మురుగదాస్ కథకీ ఓకే చెప్పినట్టు సమాచారం. గత కొంతకాలంగా ఓ కథతో బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాడు మురుగదాస్. సల్మాన్ ఖాన్ ని కలిసి ఓ కథ చెప్పాడు.కుదర్లేదు. ఇప్పుడు అదే కథ షారుక్ దగ్గరకు వెళ్లడం, షారుక్ ఓకే చెప్పేయడం జరిగిపోయాయని టాక్. తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ లోనే ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. అట్లీ తో సినిమా అవ్వగానే.. మురుగదాస్ కథే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో కూడా ఓ సినిమా చేయడానికి మురుగదాస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లు అర్జున్ తో స్టోరీ సిట్టింగ్స్ జరిగాయి. బన్నీ కూడా మురుగదాస్ తో సినిమా చేయడానికి పాజిటీవ్ గానే ఉన్నాడని టాక్. మురుగదాస్ బాలీవుడ్లో చేస్తే ఆ సినిమా షారుక్తోనే. టాలీవుడ్ లో చేస్తే బన్నీ తోనే. ప్రస్తుతానికి ఇవి ఫిక్స్. కాకపోతే.. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏది ముందుకు వెళ్తుందన్నది ఇంకా క్లారిటీ లేదు.