ఎస్.ఎస్. తమన్‌ని సంగీత దర్శకుణ్ణి చేసిందే రవితేజ! మణిశర్మ దగ్గర పని చేస్తున్న ఘంటసాల సాయిని ఎస్.ఎస్. తమన్‌గా ‘కిక్’తో సంగీత దర్శకుడిగా పరిచయం చేశాడు మాస్ మహారాజ రవితేజ. తర్వాత ‘ఆంజనేయులు’, ‘మిరపకాయ్’, ‘వీర’, ‘నిప్పు’, ‘బలుపు’ వంటి సినిమాలు రవితేజ–తమన్ కాంబినేషన్లో వచ్చాయి. తమన్ కెరీర్ మొదలుపెట్టిన కొత్తల్లో రవితేజ అతణ్ణి ఎంతో ఎంకరేజ్ చేశాడు. ఇటీవల ఈ కాంబినేషన్‌కి కొంచెం బ్రేక్ పడింది. రవితేజ సినిమాల మధ్య కొంచెం ఎక్కువ బ్రేక్ రావడం ఓ కారణం కావొచ్చు… మిగతా హీరోల సినిమాలతో తమన్ బిజీ కావడం కావొచ్చు… వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇటీవల సినిమాలు రాలేదు. కొంచెం గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్‌ని సెట్ చేశాడు దర్శకుడు వీఐ ఆనంద్. ‘టైగర్’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ సినిమాలు తీసిన ఈ దర్శకుడు రవితేజతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. బుధవారం మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. సినిమా ప్రీ ప్రొడక్షన్ ఫుల్ స్వింగులో జరుగుతోందని, డిసెంబర్ నుంచి షూటింగు మొదలు కానుందని వీఐ అనంద్ తెలిపాడు!!