ట్రంప్‌ను అధ్యక్షుడిగా చేయడానికి టెస్లా చీఫ ఎలాన్ మస్క్ కష్టపడినతంగా ఎవరూ కష్టపడటం లేదు. తనకు మంత్రి ఇస్తారన్న ఆశతో మస్క్ వందలకోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఆయన కొత్తగా ఓటుకు నోటు స్కీమ్ కూడా ప్రారంభించారు. అందరికీ తలా డాలర్ పంచడం కన్నా… లాటరీ తీసి రోజుకు ఒక్కరికి ఇవ్వడాన్ని మస్క్ తెలివిగా అమలు చేస్తున్నారు. అమెరికాలో ఓటుకు నోటివ్వడం కూడా నేరమే. అందుకే ఆయన నేరుగా రాజకీయ పార్టీలకు ఓటు వేయమని కోరకుండా పిటిషన్ డాట్ ది అమెరికా పీఏసీ డాట్ కామ్ లో లాగిన్ అయి ట్రంప్‌కు మద్దతుగా ఓటేసేవారికి ఇస్తున్నారు. ఇక్కడే ఎలాన్ మస్క్ తెలివితేటలు బయటపడుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ ఐదో తేదీన జరుగుతాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ముందస్తు ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ ప్రచార ఖర్చుల్ని ఆయనే ఎక్కువగా భరిస్తున్నారు. ఇప్పటికి మన రూపాయల్లో పదిహేను వందల కోట్లకుపైగా ఖర్చు పెట్టారు. ఎంతైనా ఖర్చు పెడతానని సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇలా ఓటుకు నోటు ప్రారంభించారు. ప్రజల్ని డొనాల్డ్ ట్రంప్‌కు ఓటేసేలా చేయడమే ఆయన లక్ష్యం.
మస్క్ తన కోసం చేస్తున్న కృషిని డొనాల్డ్ ట్రంప్ గుర్తించారు. తాను గెలవగానే తన కేబినెట్లోకి మస్క్ ను తీసుకుంటానని ప్రకటించారు, ఎలాన్ మస్క్ చాలా తెలివైన వ్యక్తి అని కితాబిస్తున్నారు. ఆయన తెలివైన వ్యక్తి కాబట్టే… ఆ స్థాయిలో ఉన్నారని గుర్తించారో లేకపోతే.. తనకు మద్దతిస్తున్నాడు కాబట్టి మస్క్ తెలివి గల వ్యక్తి అనుకుంటున్నారో అని ట్రంప్‌పై అమెరికాలో సెటైర్లు పడుతున్నాయి. అయితే ఇలా డబ్బులు పంచడంపై అమెరికాలో దర్యాప్తు ప్రారంభమయింది. అందులో ఇరుక్కుంటే మస్క్ కు సమస్యలు వచ్చి పడే అవకాశం ఉంది.