తెలంగాణలో తొలి ఎన్నికల ప్రచారసభలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే.. ఆదిలాబాద్, నిజామాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో సభలు పెట్టుకున్నారు. ఈ సభల లక్ష్యం ప్రధానంగా ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించడమే. ముస్లిం ఓటర్లపైనే కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి సారించడానికి బలమైన కారణాలే ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ముస్లిం ఓటర్ల సంఖ్య 12 శాతం వరకూ ఉంది. అనేక నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి కంటే.. ఇప్పుడే తెలంగాణలో ముస్లింలు మరింత బలంగా కనిపిస్తున్నారు.
అధికారంలో ఉన్న పార్టీలతో మజ్లిస్ అవగాహన..?
హైదరాబాద్ పాతబస్తీలోనే కాదు.. శివారు నియోజకవర్గాల్లోనూ.. ముస్లిం ఓటర్లు గెలుపోటముల్ని నిర్దేశించగలిగే స్థితిలో ఉన్నారు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, వికారాబాద్ లాంటి ప్రాంతాల్లోనూ… ముస్లింలు గణనీయంగా ఉన్నారు. ముస్లింలకు అండగా ఉంటున్న పార్టీగా మజ్లిస్ పాతబస్తీలో పట్టు నిలుపుకుంటూ వస్తోంది. అయితే ఆ పార్టీ ఇతర ప్రాంతాలపై ఇంకా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. అందుకే… అధికారంలో ఎవరు ఉన్నా.. మజ్లిస్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ అదే జరిగింది. నిజానికి కరీంనగర్, బైంసా లాంటి ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ మంచి విజయాలను నమోదు చేస్తోంది. కానీ.. ఆ పార్టీ అక్కడ అభ్యర్థులను నిలబెట్టదు. దీనికి కారణం ఏమిటంటే.. అధికారంలో ఉన్న పార్టీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం. పాతబస్తీలో… తమ కంచుకోటగా ఉంచుకోవాలంటే.. అధికారంలో ఉన్న పార్టీతో ఉన్న అవగహనకు ఎంఐఎం వస్తుంది. ఈ అవగాహన ఏమిటంటే.. పాతబస్తీలోకి తాము రాము.. మిగతా ప్రాంతాల్లోకి ఎంఐఎం రాదని… ఆ అవగాహన. గతంలో కాంగ్రెస్ తో .. ఇప్పుడు టీఆర్ఎస్ తో ఇదే అవగాహన.
ఎన్నికల తర్వాత మజ్లిస్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అవుతారా..?
అయితే ఎంఐఎం ఎప్పుడూ నేరుగా పొత్తు పెట్టుకోదు. ఓ అవగాహనకు మాత్రమే వస్తుంది. పాతబస్తీలో… ఇతర బలమైన పార్టీలు.. బలహీన అభ్యర్థుల్ని నిలబెడతాయి. దానికి బదులుగా..ఇతర ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట మజ్లిస్ వీక్ క్యాండెట్లను నిలబెడుతుంది. చాలా రోజులుగా ఇదే జరుగుతుంది. ఈ కాన్సెప్ట్‌తోనే ఇప్పటికీ ఏడు సీట్లను సునాయాసంగా గెల్చుకుంటూ వస్తోంది. కేసీఆర్ ఇప్పటికీ… బహిరంగంగా చెబుతూంటారు.. ఎంఐఎంతో.. ఫ్రెండ్లీ ఫైటింగ్ ఉంటుంది. ఫ్రెండ్లి ఫైటింగ్ అంటే.. లోపాయికారీ పొత్తులే. ఇప్పుడు ఇంకో టాక్ ఏమిటంటే.. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత హంగ్ లాంటిది ఏమైనా వస్తే… టీఆర్ఎస్కు తక్కువ సీట్లు వస్తే.. ఎంఐఎం సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. మజ్లిస్‌ను ఎమ్మెల్యేలను కూడా కేబినెట్లోకి తీసుకుంటారన్న చర్చ నడుస్తోంది. ఎంఐఎంకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కూడా ఇవ్వవొచ్చన్న చర్చ కూడా నడుస్తోంది.
ముస్లిం ఓట్లు దూరం కాకూడదనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారా..?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. 12 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అలా ఇచ్చి… ముస్లిం ఓట్లన్నింటినీ… కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేలా చేయగలిగారు. తెలంగాణలో రిజర్వేషన్ల అంశంతో… ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు. దానికి కౌంటర్ గా కేసీఆర్ 12 శాతం రిజర్వే,న్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తీర్మానం చేసిన కేంద్రానికి పంపించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తామని చెబుతున్నారు. అదే సమయంలో… ప్రస్తుతం దేశంలో యాంటీ మోడీ వేవ్ ఉంది. మోడీపై ముస్లిం వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మోడీని మళ్లీ అధికారంలోకి రాకూడదని వారు కోరుకుంటారు. మోడీని ఓడించే శక్తి కాంగ్రెస్ కే ఉంది కనుక..వారంతా కాంగ్రెస్‌కే ఓట్లు వేద్దామనుకుంటారు. ఈ విషయం తేలివిగా ఆలోచించారు కాబట్టే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ బీజేపీ ప్రభావం తన పార్టీ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయానికి తన వ్యూహం మార్చుకోవచ్చు.
హిందూత్వ ఓట్లను సమీకరించే పనిలో బీజేపీ ఉందా..?
ముస్లిం ఓట్లను టార్గెట్ చేసుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు కాబట్టి.. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే..మోడీకి వ్యతిరేకంగా … ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ బలంగా రాహుల్ గాంధీ ఉన్నారు కనుక… ఆయనకు ముస్లింలలో సానుకూలత వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు బీజేపీ… కూడా… ఈ రేసులో తన వంతు ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ముస్లిం ఓట్ల కోసం ప్రయత్నిస్తూంటే… బీజేపీ హిందూత్వ ఓట్లను పోలరైజ్ చేసుకునే పనిలో పడింది. ఉత్తరాదిన… బీజేపీ అనుసరించిన వ్యూహాన్ని… ఇక్కడ అమలు చేస్తున్నారు. యూపీ, బీహార్లలో అక్కడి ప్రాంతీయ పార్టీలు ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు.. యాంటీ ముస్లిం విధానాలతో.. అక్కడ హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడా అదే చేస్తున్నారు. పైగా పరిపూర్ణానందను పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ మొత్తం చూస్తే అర్థమయ్యేదేమిటంటే.. చాలా పక్కాగా… యూపీ మోడల్‌నే తెలంగాణలో అమలు చేస్తున్నారనుకోవాలి.
పరిపూర్ణానంద రాజకీయ లక్ష్యం ఏమిటి..?
అక్కడ యోగి ఆదిత్యనాథ్ ను ఉపయోగించుకుని.. హిందూత్వ వాదనను సమర్థంగా ఉపయోగించుకోవాలి. పక్కా భాషలో చెప్పాలంటే..మైనార్టీల సంతుష్టీకరణ కోసం సమాజ్ వాదీ పార్టీ చేసిన ప్రయత్నాలను యోగీ ఆదిత్యనాథ్.. హింటూ ఓట్లను పోలరైజ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అదే వ్యూహాన్ని పరిపూర్ణానందను ఉపయోగించుకుని తెలంగాణలో చేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.