నవ్యాంధ్రకు కేంద్రంగా మారిన బెజవాడ అనూహ్యంగా ఎదిగిపోతోంది. అభివృద్ధిలోనే కాదు. నేరాల్లో కూడా. మెట్రో లుక్ వచ్చిన నగరాల్లో సైతం…చోటు చేసకుకోనన్ని విచ్చల విడి జల్సాలతో కూడిన … నేరాలు… సిటీలోకి వచ్చేశాయి. వీటికి ప్రముఖ హోటళ్లే అడ్డాగా మారుతున్నాయి. గతంలో పేకాటలు, క్లబ్బులు, రికార్డింగ్ డాన్సులకే పరిమితమైన నేరాలు.. ఇప్పుడు ముజ్రా డాన్సుల పార్టీల పేరుతో… “స్ట్రిప్ టీజ్” పార్టీలు ఏర్పాటు చేసుకునేదాకా వెళ్తున్నాయి. ఇవన్నీ బాగా “డబ్బు” చేసిన వారిని టార్గెట్ చేసుకుని నడుస్తున్నాయి.
విజయవాడలో ఓలైవ్ ట్రీ హోటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు సమాచారం అందితే వెళ్లి సోదాలు చేశారు. అక్కడి పరిస్థితులను చూసి పోలీసుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆరుగురు మహిళలు దాదాపు నగ్నంగా డాన్స్ చేస్తూంటే… వారి చుట్టూ… యాబై, అరవై మంది కూర్చుని.. మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో కిక్ ఎక్కిన వాళ్లు వెళ్లి వారితో కలిసి అసభ్యంగా డాన్స్ చేస్తూ చిందులేస్తున్నారు. ఇలాంటి పార్టీలు కూడా విజయవాడలో జరుగుతున్నాయన్న సమాచారం అప్పటి వరకూ పోలీసులకు లేదు..మామూలుగా ఇలాంటి వాటిని ముజ్రా పార్టీలుగా చెబుతూంటారు. మెట్రో సిటీల్లో ఉండే ధనవంతలు.. ఫార్మ్ హౌసుల్లో పార్టీలు చేసుకుంటే ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ విజయవాడలో హోటల్లోనే సెటప్ పెట్టేశారు. ఆరుగురు అమ్మాయిలతో పాటు 53 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముజ్రా పార్టీల పేరుతో… హోటల్ నిర్వాహకులు…వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు గుర్తిచారు. ఐదు వేల నుంచి పది వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఒక్క పార్టీ నిర్వహించి ఐదు నుంచి పది లక్షల వరకూ సంపాదిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సభ్య సమాజం అంగీకరించని ఆనందాల కోసం.. ఎంతైనా ఖర్చు పెట్టగల బలహీన మనస్థత్వం ఉన్న వాళ్లను టార్గెట్ చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. విజయవాడకు మెట్రో కల్చర్ వస్తూండటంతో..ఇలాంటి నేరాలు ఇంకా పెరిగిపోతాయని.. హోటళ్లపై నిఘా పెంచాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.