విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈడీ కేసులలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇటీవల తన ఇంట్లో ఈడీ సోదాలు, ఆ సోదాల్లో దొరికిన అంశాలపై ఈడీ ప్రకటనలో అవకతవకలు గుర్తించడంతో తనను అరెస్టు చేస్తారన్న భయంతో ఎంవీవీ సత్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అడ్డగోలు పనుల వల్ల ఎంవీవీకి మనశ్శాంతి ఉండటం లేదు. ఇష్టం వచ్చినట్లుగా కబ్జాలు చేసేసి.. దోపిడీలు చేసిన వ్యవహారం ఆయన మెడకు చుట్టుకుంది. ఇవ్వాల్సిన వాళ్లకు వాటాలు ఇవ్వకపోవడంతో వారు కుటుంబాన్ని కిడ్నాప్ చేయించారు. చివరికి సాక్షి పత్రికలో రెండు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చి కవర్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే అధికారం పోయినప్పటి నుంచి అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. అవన్నీ బయటకు వస్తున్నాయి.
ఇప్పుడు ఎంవీవీ సత్యనారాయణ ఎవరికీ అందుబాటులో ఉండటం లేదు. ఈడీ తనిఖీలు చేసిన సమయంలోనూ ఆయన విశాఖలో లేరు. వైసీపీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. చాన్స్ ఇస్తే పార్టీ మారతానని ఆయన కూటమి పార్టీలను సంప్రదించారు. కానీ చేయాల్సింది చాలా ఉందని సాధ్యం కాదని వారు సమాధానం ఇచ్చారు. దాంతో ఎంవీవీ ఎలా బయటపడాలా అని మథన పడుతున్నారు.