విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు భూదందాలకు దిగుతున్నారని పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూర్మన్న పాలెంలో ఓ డెలవప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారని అందులో స్థల యజమానులకు ఒక్కటంటే ఒక్క శాతం మాత్రమే ఇచ్చి తాను 99 శాతం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకే చెందిన మరో ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని మీడియా చెప్పింది.
అయితే ఇదంతా అవాస్తవమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంవీవీ సత్యనారాయణ లీగర్ నోటీసులు పంపుతున్నట్లుగా ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల మధ్య విశాఖలో ఏర్పడిన వివాదం వల్ల బయటకొస్తున్న విషయాలను చెబుతున్న మీడియాపైనా వారు పరువు నష్టం కేసులు వేస్తూండటం చర్చనీయాంశంగా మారింది. అసలు కూర్మన్నపాలెం భూములు.. ఒప్పందాల గురించి బయట పెట్టింది విజయసాయిరెడ్డి. ఆయనకు ఎంపీ సత్యనారాయణ నోటీసులు ఇవ్వకుండా … ఆ విషయాలను బయటపెట్టిన మీడియాకు నోటీసులు ఇస్తే ఏం ప్రయోజనం ఉంటుంది ?.
వైసీపీలో ఇద్దరు ఎంపీల మధ్య భూదందాల్లో వచ్చిన తేడాలోనే అంతా రచ్చ అవుతోంది. విశాఖలో కబ్జాలకు పాల్పడిన ఒక్కొక్కరి జాతకాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతలా దోచుకున్నారా అని ప్రజలే ఆశ్చర్యపోయే పరిస్థితి. అయితే వీటిని బయట పెడుతున్న మీడియాపై నోటీసుల పేరుతో బెదిరింపులకు దిగుతూ.. సొంతపార్టీ నేతలకు నోటీసులు ఇచ్చే ధైర్యం మాత్రం సదరు ఎంపీలకు ఉండటంలేదు.