చినజీయర్‌తో పాటు మైహోం రామేశ్వరరావు తీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని తేలిపోయింది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన రాష్ట్రపతికి స్వాగతం పలికిన కేసీఆర్ ఆయనతో పాటు వెళ్లలేదు. మళ్లీ ప్రగతి భవన్‌కు వెళ్లారు. దీంతో గ్యాప్ నిజమేనని తేలిపోయింది. టీఆర్ఎస్ నేతలు కూడా వెళ్లడం లేదు. ఇది చినజీయర్‌తో పాటు రామేశ్వరరావుకూ ఇబ్బందికరమే. ప్రధాని అండ ఉంటుందని చినజీయర్ నిబ్బరంగా ఉండగలరేమో కానీ మైహోం రామేశ్వరరావు అలా ఉండలేరు.
ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యం తెలంగాణలో నలుదిశలా విస్తరించడానికి కేసీఆర్ సాయమే ఎంతో కారమణని ప్రచారం ఉంది. ఇప్పుడే కాదు తెలంగాణ ఏర్పడక ముందు నుంచి రామేశ్వరరావుతో కేసీఆర్‌కు సాన్నిహిత్యం ఉంది. సీఎం అయిన తర్వాత మరింత పెరిగింది. ఇంత వరకూ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లుగా ఎప్పుడూ ప్రచారం జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం జరుగుతోంది. దీంతో రామేశ్వరరావు కేసీఆర్‌ను కూల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మోడీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించేటప్పుడు శిలాఫలకంపై కేసీఆర్ పేరు లేదు.
కానీ ఇప్పుడు కేసీఆర్ పేరును పెద్ద అక్షరాలతో చేర్చినట్లుగా తెలుస్తోంది. అలాగే కేసీఆర్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా మరికొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇవన్నీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందమేనని టీఆఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల రాజకీయాల్లో రామేశ్వరరావు వంటి వారి సాయం కేసీఆర్‌కు ఎంతో అవసరమని.. ఇద్దరి మధ్య గ్యాప్ రాదని మరో వర్గం గట్టి నమ్మకంతో ఉంది.