ఏపీ సీఎం చంద్రబాబుతో టీవీ9 యజమాని మైహోం రామేశ్వరరావు,ఆయనకుమారుడు రెండో తేదీన సమావేశం అయ్యారు. అమరావతి సెక్రటేరియట్లో దాదాపుగా గంటకుపైగా ఈ సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది . ఈ సమావేశంలో చర్చించిన అంశాలేమిటో బయటకు రాలేదు కానీ గతంలో జగన్ కోసం చేసిన నిర్వాకాల కారణంగా ఏర్పడిన గ్యాప్‌ను పూడ్చుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని అనుకోవచ్చు.
ఈ సమావేశానికి కాస్త పాజిటివ్ లుక్ తీసుకు వచ్చేందుకా అన్నట్లుగా టీవీ9లో గత కొంత కాలంగా అమరావతికి, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రయారిటీ ఇచ్చి ప్రచారం కల్పించేందుకు పలు కార్యక్రమాలు ప్రసారం చేశారు.ఆ తర్వాత రామేశ్వరరావు,ఆయన కుమారుడు వచ్చి చంద్రబాబును కలిశారు. తాము మీకు వ్యతిరేకంగా కథనాలు రాయడం లేదని.. మీ శ్రేయోభిలాషులమేనని చెప్పుకునే ప్రయత్నం జరిగిందని అనుకోవచ్చు.
అయితే టీవీ9 ప్రసారాల్లో మౌలికమైన మార్పులు ఏమీ రాలేదు. కౌంటింగ్ రోజు వరకూ ఆ చానల్ చేసిన ఓవరాక్షన్..చివరికి సర్వేలను కూడా మ్యానిప్యులేట్ చేసిన వైనం అన్నీ టీడీపీ క్యాడర్,లీడర్ అంత తేలికగా మర్చిపోయారు. లోకేష్ ను ఎలా వ్యక్తిత్వ పరంగా కించ పరిచేలా చేశారో.. పవన్ కల్యాణ్ పై ఏ లోకల్ లీడర్ ఘోరమైన వ్యాఖ్యలు చేసినా బ్రేకింగులు ఎలా వేసేవారో అందరికీ గుర్తుంటుంది. ప్రభుత్వం మారిన తర్వాత వారు చంద్రబాబు,టీడీపీ, లోకేష్‌ను కాకా పడుతూ చాలా స్టోరీలేస్తున్నారు. వాటిని చూసి ఇతరులు టీవీ9ని అసహ్యించుకుంటున్నారు. మాములుగా ఉండలేరా అన్న ప్రశ్నలు వేస్తున్నారు. కూటమి నేతలదీ అదే అభిప్రాయం. ఎందుకంటే టీవీ9లో వస్తున్న పొగడ్తలు ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి కానీ మనస్ఫూర్తిగా చేస్తున్నట్లుగా లేవు.
ఇప్పటికీ ప్రభుత్వంపై కొంత మంది చేసే అనుచిత వ్యాఖ్యలు అదే పనిగా ప్రసారం చేస్తున్నారు. కూటమిలో ముఖ్యనేతలకు మాత్రం కవరేజ్ ఇస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యాపారసంబంధాలు కూడా గట్టిగా పెట్టుకున్నారన్న ప్రచారం ఉంది. జగన్ కు టీవీ9లో బినామీ వాటాలు ఇచ్చారని కూడా చెబుతారు. అందుకే ఆ చానల్ ను టీడీపీ బాయ్ కాట్ చేసింది. ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో తమపై చల్లని చూపు చూడాలని రామేశ్వరరావు ఆయన పుత్రరత్నం చంద్రబాబును కోరేందుకు కలిసి ఉంటారని భావిస్తున్నారు.
అయితే 2014-19 సమయంలో రెండు చానళ్లు ఇలాగే కనీసం మీడియా విలువలు పాటిస్తామని చెబితే నారా లోకేష్ కాస్త కనికరం చూపారు.తర్వాత భయంకరమైన విషం చిమ్మారు. ఇప్పుడు మళ్లీ ఆ చానళ్లు చెప్పే కబుర్లను విని నమ్మేందుకు సిద్దంగా లేరని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో ?