వైకాపాకి రాజీనామా చేసి ఇవ్వాళ్ళ బయటకు వచ్చిన మైసూరా రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని అపరిచితుడితో పోల్చారు. ఆయన ఎవరి మాట వినడని, ప్రజల కోసం ఆయన చేస్తున్న పోరాటాలు రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నావే తప్ప నిజంగా ప్రజాసమస్యలని పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో కాదని విమర్శించారు. ఆయనకు అహంకారం, డబ్బు యావ చాలా ఎక్కువని విమర్శించారు.
ఆయనకు ప్రస్తుతం డిల్లీలో ఉన్న వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అక్కడి నుంచే మీడియా ద్వారా చాలా ఘాటుగా బదులిచ్చారు. నిజానికి మైసూరా రెడ్డే అపరిచితుడని అన్నారు. ఆయన పదవులు అధికారం కోసం మొదట తెదేపాలో చేరారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని భావించి వైకాపాలోకి వచ్చారు. వైకాపాలోకి వచ్చినా తెదేపా ఏజంటులాగే వ్యవహరించారు తప్ప వైకాపా నేతగా వ్యవహరించలేదు. పార్టీ ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్లు చేసి తెదేపాలో చేరమని ప్రోత్సహించేవారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతానని చెప్పి ఆ ఆలోచన విరమించుకొన్నారు. ఆరు నెలల నుంచి పార్టీకి దూరంగా ఉంటూ ఇప్పుడు అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డిని నిందిస్తూ పార్టీని వీడుతున్నారు. ఇంత విచిత్రంగా వ్యవహరిస్తున్న ఆయనే అపరిచితుడు. జగన్మోహన్ రెడ్డి మా వంటి సీనియర్లందరి సలహా సంప్రదింపులు చేస్తుంటారు. ఆయన తెదేపా సూచిస్తున్నట్లుగానే మాట్లాడారు తప్ప ఆయన చేసిన ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదు. బహుశః ఆయన తన సిమెంట్ కంపెనీ
తన సిమెంటు ఫ్యాక్టరీకి మైనింగ్ లీజులు, బ్యాంక్ గ్యారంటీలు పొందడానికే తెదేపా చెపుతున్నట్లు వ్యవహరిస్తున్నారని నా అనుమానం. తెదేపా బాషలో ఉన్న ఆయన రాజీనామా లేఖను చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. ఆయన వైకాపాలో ఇమడలేకపోతే నిరభ్యంతరంగా ఆ మాట చెప్పేసి వెళ్లిపోవచ్చు కానీ వెళ్ళిపోతూ ఇంతకాలం ఆదరించిన జగన్మోహన్ రెడ్డి గురించి ఆ విధంగా మాట్లాడటం చాలా తప్పు,” అని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.
ఇదివరకు పార్టీని వీడి వెళ్ళిపోయినా వారు చాలా మంచి మైసూరా రెడ్డి చేసిన పిర్యాదునే చేసేవారు. కానీ వైకాపా వాటిని పట్టించుకొనేది కాదు. మైసూరా రెడ్డి చేసిన విమర్శలకు మాత్రం తక్షణమే జవాబు చెప్పడం విశేషమే.