“ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాఫ్టర్లలోనే డబ్బులు తరలిస్తున్నారు…” ఇది ఏపీ ఎన్నికల సమయంలో.. బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు. ఇందులో నిజం ఉంటే… బీజేపీ నేతలు దాడులు చేయించడం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద విషయం కాదు. కానీ వారు ఆరోపణలకే పరిమితం అయ్యారు. వారికి అలాంటి ఐడియా ఎలా వచ్చిందో కానీ.. కర్ణాటకలో మాత్రం… ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారసభకు వచ్చిన హెలికాఫ్టర్ నుంచి.. ఓ పెద్ద.. ట్రంక్ పెట్టెను రహస్యంగా తరలించడం మాత్రం వీడియోల్లో నిక్షిప్తమయింది. ఆ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ.. ఆ ట్రంక్ పెట్టేలో ఏముందో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
తొమ్మిదో తేదీన కర్ణాటక ఎన్నికల ప్రచారం కోసం .. ప్రధానమంత్రి మోడీ.. చిత్రదుర్గ వెళ్లారు. ప్రత్యేక విమానంలో… కర్ణాటక వెళ్లిన ఆయన… హెలికాఫ్టర్‌లో చిత్రదుర్గకు వెళ్లారు. సాధారణంగా ప్రధానమంత్రి సెక్యూరిటీ కాబట్టి… వీడియోలు షూట్ చేయడానికి కూడా చాన్స్ ఉండదు. కానీ.. చిత్రదుర్గలో మాత్రం… సమీపంలోని ఓ భవనం పై నుంచి… మోడీ.. హెలికాఫ్టర్ వచ్చిన దృశ్యాలను కొంత మంది చిత్రీకరించారు. అయితే.. మోడీ హెలికాఫ్టర్ అలా ఆగిన వెంటనే.. కొంత మంది… హెలికాఫ్టర్ నుంచి ఓ పెద్ద ట్రంక్ పెట్టేను తీసుకుని.. హడావుడిగా వేగంగా పరుగులు పెట్టుకుంటూ… ఆ పెట్టెను తీసుకెళ్లి.. అప్పటికే… స్టార్ట్ చేసి రెడీగా ఉన్న… ఇన్నోవా కారులో పెట్టారు. అలా పెట్టిన మరుక్షణం ఆ కారు.. వేగంగా.. వెళ్లిపోయింది. ఈ వీడియో బయటకు రావడంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది.
కాంగ్రెస్, జేడీఎస్‌లు.. మోడీపై తీవ్రమైన విమర్శలు చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీకి.. ఆ పెట్టోలో ఏముందో విచారణ జరిపించాలని ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది. మామూలుగా అయితే.. ప్రధాని హెలికాఫ్టర్ దగ్గరకు కాన్వాయ్ లోని కార్లను మాత్రమే అనుమతిస్తారు. కానీ… ఆ కారును ప్రత్యేకంగా అనుమతించారు. ఆ కారు ట్రంక్ పెట్టెను తీసుకెళ్లింది. ఇంతకీ ఆ కారు ఎవరిది..? ఆ ట్రంక్ పెట్టేలో మోడీ ఏం తెచ్చారు..? దాన్ని అంత రహస్యంగా ఎందుకు తీసుకెళ్లారు..? ఇవన్నీ ఇప్పుడు… మిలియన్ డాలర్ క్వశ్చన్లుగా మారాయి.