మైత్రీ మూవీస్ సంస్థ ఏ ముహుర్తాన తెరి సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని స్క్రిప్ట్ పని మొదలు పెట్టిందో, అప్పటి నుంచి మూడు అడుగులు ముందుకు, అయిదు అడుగులు వెనక్కు నడుస్తోంది. డైరక్టర్ గా రభస లాంటి డిజాస్టర్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ ను తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరో అనుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. స్క్రిప్ట్ కాస్త మార్చి రవితేజ హీరో అనుకున్నారు.
కానీ అమర్ అక్బర్ ఆంథోనీ ఫ్లాప్ కావడంతో మళ్లీ వెనక్కు పెట్టారు. ఆ తరువాత మళ్లీ రవితేజతోనే అని ఫిక్స్ అయ్యారు. ఏప్రియల్ నుంచి షూటింగ్ అనుకున్నారు. కానీ మళ్లీ ఏమయిందో? ఇప్పుడు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇక తెరి సినిమా స్క్రిప్ట్ ను పక్కన పడేయాలని మైత్రీ మూవీస్ నిర్థారణకు వచ్చేసినట్లు తెలుస్తోంది.
అసలు ముందు హీరోను మార్చడమా? స్క్రిప్ట్ మార్చడమా అని ఆలోచిస్తున్నారట. స్క్రిప్ట్ నే వదిలేసి వేరే స్క్రిప్ట్ చేయించడం బెటర్ అనే నిర్ణయానికి వస్తున్నారట. కానీ డైరక్టర్ ను మారిస్తే ఏ హీరో అయినా డేట్ లు ఇస్తారేమో? లేదూ అంటే రభస గుర్తుకు వచ్చి దూరంగా వుంటారేమో? ఆలోచించాలి