ఈరోజు సమంత పుట్టిన రోజు. ఆమె అభిమానులు, నిర్మాతలు, దర్శకులు అంతా సమంతకు వివిధ రూపాల్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. విజయ్ దేవరకొండ – సమంత కలిసి ఓ సినిమా చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్ర యూనిట్ మాత్రం సమంతకు సర్ప్రైజ్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతోంది. బుధవారం అర్థరాత్రి 12 గంటలకు ఓ సీన్ ప్లాన్ చేశారు. విజయ్ దేవరకొండ ఓ చోట దిగులుగా కూర్చుంటే, సమంత వచ్చి.. సర్దిచెప్పే సీన్ అది. సమంత డైలాగులన్నీ అయిపోయాక.. విజయ్ రియాక్షన్ ఇవ్వాలి. అయితే.. విజయ్ చటుక్కున తిరిగి.. `సమంత.. హ్యాపీ బర్త్ డే` అని చెప్పేశాడు. సీన్లో.. `సమంత అని పేరు పెట్టి పిలిచాడేమేటి` అని రియాక్షన్ ఇచ్చి, అంతలోనే అది తన బర్త్ డే అని గుర్తొచ్చి.. షాకైపోయింది శామ్. ఆ ఆనందంలోనే … కన్నీటి భాష్పాలూ వచ్చాయి. వెంటనే.. చుట్టూ ఉన్న టీమ్.. ఓ పెద్ద కేక్ తీసుకొచ్చి, సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. కేక్ కట్ చేయించి, ఆనందం పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. సెట్లో.. ఓ హీరోయిన్ బర్త్ డేని… ఇలా చేయడం నిజంగానే వెరైటీగా, సర్ప్రైజింగ్గా ఉంది.
From the sets of #VD11 ?
Wishing queen @Samanthaprabhu2 a very Happy Birthday ❤️@TheDeverakonda @ShivaNirvanahttps://t.co/cOK1mLsrlF
— Mythri Movie Makers (@MythriOfficial) April 28, 2022